హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ.. జబర్దస్త్ కమెడియన్స్ తో స్పెషల్ ఈవెంట్..!

lakhmi saranya
బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో పార్టిసిపేట్ చేసిన ఈ బ్యూటీ తనదైన తీరులో ప్రేక్షకులను మెప్పించి మంచి పేరును సంపాదించుకుంది. బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె అనంతరం ఓటిటి సీజన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది. మొన్నటి వరకు అమెరికాలో ఉన్న ఈ బ్యూటీ ఈమధ్య వర‌స‌ సినిమాలతో అలరిస్తుంది. ఫోకస్ అనే చిత్రంలో పోలీస్ ఆఫీసర్గా నటించిన అషు రెడ్డి ఇటీవల యేవమ్ అన్నయ్య మరో చిత్రంతో ప్రేక్షకులు ముందుకి వచ్చింది.
ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటించిన సినిమా పద్మవ్యూహంలో చక్రధారి. ఈ సినిమా వీసీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందింది. ప్రవీణ్ రాజ్ కుమార్ హీరోగా, శశికా , అషు రెడ్డి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా నేడు అనగా జూన్ 21న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం రిలీజ్ కంటే ముందు ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఆంధ్రప్రదేశ్లోని రాయచోటి  లో ప్రముఖులు అండ్ ముఖ్య అతిథిల మధ్య చిత్ర యూనిట్ ఘనంగా ఈ ఈవెంట్ వేడుక నిర్వహించారు.
ఇక ఈ వేడుకలో మూవీ కాస్ట్ అండ్ క్రూ తో పాటు జబర్దస్త్ నటీనటులు వినోదిని, పంచ్ ప్రసాద్, నాగిరెడ్డి, ఉప్పల్ పాలు, ఫణి తదితరులు హాజరయ్యారు. ఇక బిగ్ బాస్ లో తన సత్తా చాటిన ఈ బ్యూటీ ఒక్కసారిగా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంతో పలువురు ఆశ్చర్యపోతున్నారు. మొన్నటి వరకు వ‌ర‌స‌ షోస్లో కనిపించిన ఈ బ్యూటీ ఒక్కసారిగా హీరోయిన్ అయిపోవడంతో ఈమె అభిమానులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంటే రానున్న రోజుల్లో ఈ బ్యూటీకి మంచి అవకాశాలు దక్కుతాయని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: