ఓటీటీలోకి అడుగుపెట్టిన సమంత, నయనతార కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

lakhmi saranya
సమంత, నయనతార అండ్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో పోషించిన మూవీ డబల్ ట్రబుల్. ఈ మూవీ హిందీ వర్షన్ ఓటిటిలో రిలీజ్ అయింది. డబల్ ట్రబుల్ పేరుతో జియో సినిమా ఓటిటిలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. గురువారం డబల్ ట్రబుల్ విడుదల అయినట్లు జియో సినిమా ఓటిటి అఫీషియల్ గా ప్రకటించింది. ఇక ఈ సినిమా పోస్టర్ను కూడా ప్రేక్షకులతో పంచుకుంది. 2022లో తమిళంలో ఈ సినిమా రిలీజ్ అయింది. దాదాపు రెండేళ్ల తర్వాత హిందీ వర్షన్ ఓటీటీలోకి రావడం జరిగింది.
ఈ సినిమాకి నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా నయనతారనే స్వయంగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది. ఇక ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కి ముందు విజయ్ సేతుపతి వరస విజయాల్లో ఉండటం.. సౌత్ లో అగ్ర కథానాయకులైన నయనతార అండ్ సమంత ఫస్ట్ టైం కలిసి స్క్రీన్ పై కనిపించడంతో వీరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. కానీ కథలో అంతగా కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు ఈ మూవీని ఆదరించలేకపోయారు. అయినప్పటికీ నెగిటివ్ టాక్ తో సంబంధం లేకుండా కమర్షియల్ గా హిట్ అయింది ఈ మూవీ.
ఈ చిత్రం 70 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి కమర్షియల్ హిట్గా నిలిచింది. ఇక ప్రస్తుతం ఆరేళ్ల తరువాత ఈ సినిమా జియో ఓటిటీ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. రాంబో(విజయ్ సేతుపతి) తనను తాను దురదృష్టవంతుడిగా భావిస్తూ ఉంటాడు. అతడు ఏది కోరుకున్నా అది జరగదు. అతడి ఫ్యామిలీకి ఉన్న శాపం కారణంగా పెళ్లి విషయంలో ఈయనకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. పగలు క్యాబ్ డ్రైవర్ గా రాత్రి బౌన్సర్ గా పని చేసే రాంబో జీవితంలో కన్మణి (నయనతార) అండ్ ఖతీజ (సమంత) ఎలా వచ్చారు? ఈ ఇద్దరినీ రాంబో ప్రేమించడానికి కారణమేంటి? అనేదే ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: