ప్రభాస్ స్పిరిట్ నుండి అదిరిపోయే అప్డేట్.. మొదటిసారి అలా కనిపించనున్న డార్లింగ్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను శరవేగంగా చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఈనెల 27న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ లో చేస్తుండడంతో దీనిపై అంచనాలు సైతం భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇకపోతే ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక ఊర మాస లుక్ లో కనిపించబోయే సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా తర్వాత మారుతి

 దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం విడుదల చేశారు. అయితే ఈ రెండు సినిమాల తరువాత ప్రభాస్ యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా కూడా అక్టోబర్ లో మొదలుపెట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. .ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి చేసిన సందీప్ ఈ సినిమాలో ప్రభాస్ ను ఎలా చూపిస్తాడు అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉంటే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో ప్రభాస్ ను రెండు డిఫరెంట్ లుక్స్ లో చూపించనున్నాడని సమాచారం.మొదటి లుక్ లో

 పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో వైల్డ్ గా చూపించనున్నాడు. మరో లుక్ లో ప్రభాస్ ఎంతో స్టైలిష్ గా కనిపించనున్నాడని సమాచారం.యానిమల్ సినిమాలో రణ్ బీర్ కపూర్ పాత్రలో ఎన్ని షేడ్స్ చుపించాడో అంతకు ఈ సినిమా వుండనుందని సమాచారం.ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక కల్కి సినిమా విషయానికి వస్తే.. మరొక ఆరు రోజుల్లో కల్కి గ్రాండ్గా విడుదల కాబోతోంది మరి గత ఎడాది సలార్ తో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్ ఈ సినిమాతో ఎటువంటి విజయాన్ని అందుకుంటాడా అని డార్లింగ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: