కావాలంటే ఎంక్వయిరీ చేయండి.. నేనేమీ దేవుడిని కాదు.. ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చి పడేసిన వేణు స్వామి..!

lakhmi saranya
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయ‌న  ఇటీవల జాతకాలు చెప్పను అంటూ సీరియస్ డెసిషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో తాను చెప్పినట్లు ఫలితాలు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు వేణు స్వామి. ప్రజెంట్ ఎందుకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. అయినప్పటికీ వేణు స్వామి మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతూనే ఉన్నాయి.
దీనిపై తాజాగా మరోసారి స్పందించాడు వేణు స్వామి. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.." ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి నాపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతున్నాయి. ఇలాంటి ట్రోలింగ్స్ నాకు కొత్తవి కాదు. నేను చెప్పిన వాటిలో హండ్రెడ్ కి 99% నిజం అవుతాయి. అది నా సక్సెస్ రేట్. ఎన్నికల ఫలితాల విషయంలో జరగలేదు. అది నేను స్వయంగా ఒప్పుకున్నాను. పెద్ద పెద్ద జ్యోతిష్కులు, స్వామీజీలు ప్లేట్లు ఫిరాయించారు. కానీ నేను ఆ టైప్ కాదు. నాకు ధైర్యం ఉంది. సబ్జెక్టు మీద దమ్ము ఉంది. నా ప్రెడిక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డిది తప్ప అన్ని నిజమయ్యాయి.
కాబట్టి నేను భయపడే సవాలే లేదు. ట్రోలింగ్ వలన వేణు స్వామి ఎక్కడున్నాడని ఫాలోవర్స్ భయపడుతున్నారు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. రిజల్ట్ తర్వాత యధావిధిగా పూజల్లో పాల్గొంటున్నాను. అయితే రెగ్యులర్ గా వచ్చే ఎంక్వయిరీల కంటే ట్రోలింగ్స్ వల్ల అవి 100% పెరిగాయి. కాబట్టి ఇంతకు ముందు మీద కాస్త బిజీగా ఉన్నాను. ఇక నా ట్రోలర్స్ పై అండ్ నా ఫ్యామిలీని వ్యక్తిగతంగా విమర్శించే వారిపై ఆ అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటున్నాను " అంటూ తెలియజేశాడు వేణు స్వామి. ప్రజెంట్ వేణు స్వామి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఈయన వ్యాఖ్యలు చూసిన పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: