విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కి టైటిల్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

lakhmi saranya
మహారాజ చిత్రంతో లాంగ్ గ్యాప్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు విజయ్ సేతుపతి. రివెంజ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ఐదు రోజుల్లో 32 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు లో 7.05 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ 3.75 కోట్లు వరకు షేర్ కలెక్షన్స్ దక్కించుకుంది. ఇక తెలుగులోను బ్రేక్ ఈవెన్ను దాటేసింది. విజయ్ సేతుపతి తెలుగు డబ్బింగ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా మహారాజా నిలిచింది.
విజయ్ సేతుపతి కెరీర్లో 50వ మూవీగా మహారాజా రిలీజ్ అయింది. ఇక మహారాజు సినిమా తరువాత తమిళంలో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు విజయ్ సేతుపతి. ఇక ఓ వెబ్ సిరీస్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశం తో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కు ఎం మణికందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సిరీస్ కు విండ్ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు మహారాజా ప్రమోషన్స్ లో విజయసేతుపతి పేర్కొన్నాడు. ఈ సిరీస్ షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు విజయ్ సేతుపతి వెల్లడించారు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విండ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. తొందరలోనే టైటిల్ తో పాటు వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టులో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సిరీస్ లో జాకి ష్రాఫ్ కీలక పాత్రలో పోషించినట్లు సమాచారం. గతంలో విజయ్ సేతుపతి అండ్ డైరెక్టర్ మణికందన్ కాంబినేషన్లో అండవన్ ,కడైసి సినిమాలు రూపొందాయి. ఇక ఈ సినిమాలు సూపర్ హిట్ అవడంతో ప్రజెంట్ వీరి కాంబినేషన్లో వచ్చే వెబ్ సిరీస్ పై ఫుల్ హైబ్స్ నెలకొన్నాయి. మరి ఈ వెబ్ సిరీస్ పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: