చెల్లెళ్లతో ప్రభాస్.. ఫోటో వైరల్.. చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్?

praveen
ప్రస్తుతం ఎక్కడ చూసినా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరే మారుమోగిపోతుంది. ఎందుకంటే ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ విడుదలకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న కల్కి మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేయగా.. ఇక ఇటీవలే కల్కి సినిమాలోని భైరవ ఆంథం సాంగ్ ని కూడా విడుదల చేశారు.

 ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎంతలా చక్కర్లు కొడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్గా దీపికా పదుకొనే నటించింది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇక బాలీవుడ్ ప్రముఖులు దిశా పఠాని, అమితాబచ్చన్ సహా కమల్ హాసన్ లాంటి ఎంతో మంది స్టాల్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన సినిమాకు సంబంధించిన ట్రైలర్ అభిమానుల్లో ఉన్న అంచనాలను మొత్తం పెంచేసింది. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ తన చెల్లెళ్లతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.

 ఇక ఈ ఫోటోలు చూడ్డానికి ప్రభాస్ అభిమానులకు రెండు కళ్ళు సరిపోవట్లేదు అని చెప్పాలి. కల్కి సినిమాలోని భైరవ ఆంథం సాంగ్ షూటింగ్ సమయంలో డార్లింగ్ ప్రభాస్ తన కజిన్స్ ప్రసీదా, ప్రదీప్తి, ప్రకీర్తి లతో కలిసి సందడి చేశారు. వారితో కలిసి బుల్లి బుల్లి స్టెప్పులు కూడా వేశారు. ప్రముఖ సింగర్ దిల్జీ దోసాన్జుకు తన కజిన్స్ ని పరిచయం చేశాడు ప్రభాస్  ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఇలా మొదటిసారి ప్రభాస్ను కజిన్ సిస్టర్స్ తో ఉన్న ఫోటోని చూసి అభిమానులు కూడా మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: