ఆ సినిమాలో ఎన్టీఆర్ కోసం బడా విలన్ ను రంగంలోకి దింపుతున్న డైరెక్టర్..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమాతో  గ్లోబల్ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా తరువాత ఆయనకి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కింది. అలా ఆ సినిమా తర్వాత ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే ఉన్నాయి. ఇక ఆ సినిమాల్లో దేవర సినిమా  కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్లో బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. అలాగే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం చివరి దశకి చేరుకుంది. అలాగే ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్

 బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వార్ 2 సినిమాలో నటించబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. హ్రితిక్ రోషన్ తో పాటు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా భారీ బడ్జెట్ తో రానుండడంతో ఇప్పటికే దీనిపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల తరువాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించబోతుందని వినికిడి. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఆగస్టు నుండి మొదలవుతుంది అన్న టాక్ వినబడుతోంది. కానీ దీనిపై

 ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. డ్రాగన్ అనే టైటిల్ తో ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. సలార్ 2తో పాటు ఎన్టీఆర్ డ్రాగన్ మూవీని ప్రశాంత్ నీల్ చేస్తాడా లేదంటే రెండు వేర్వేరుగా చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని ఖరారు చేసారంట. విలన్ పాత్ర కోసం వేట కొనసాగుతోంది. డ్రాగన్ మూవీలో విలన్స్ కి సంబందించిన ఇంటరెస్టింగ్ ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తోంది. ఈ మూవీ తారక్ కోసం ఏకంగా ఇద్దరు పవర్ ఫుల్ విలన్స్ ని ప్రశాంత్ నీల్ దించుతున్నాడంట.  ఆ పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్ అయిన బాబీ డియోల్, టైగర్ ష్రాఫ్ ని సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. బాబీ డియోల్ ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారనే మాట ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారంలో ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: