నాని ఆ సినిమా కూడా ఆగిపోయిందా..?

MADDIBOINA AJAY KUMAR
నాచురల్ స్టార్ నాని పోయిన సంవత్సరం దసరా , హాయ్ నాన్న అనే రెండు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో మొదటగా విడుదల అయిన దసరా సినిమా మంచి విజయం సాధించింది . ఈ మూవీ ద్వారా నాని కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది . ఆ తర్వాత హి నాన్న అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాని కి ఈ మూవీ తో కూడా మంచి విజయం దక్కింది.

ప్రస్తుతం నాని , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సుజిత్ దర్శకత్వంలో నాని ఓ మూవీ చేయనునట్లు వార్తలు వచ్చాయి. 

ఆల్మోస్ట్ ఈ కాంబో కన్ఫామ్ కూడా అయింది. కానీ ఆ తర్వాత ఈ సినిమాకు బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ మూవీ ని నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే సరిపోదా శనివారం సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే వేణు తో కూడా నాని ఒక మూవీ చేయడానికి కమిట్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా వేణు , నానికి కథను వినిపించినట్లు , ఆ కథ నాని కి అంతగా నచ్చనట్లు దానితో ఈ మూవీ కూడా ఆల్మోస్ట్ ఆగిపోయే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి నిజంగానే నాని , వేణు కాంబో మూవీ ఆగిపోయిందా లేదా అనే దానిపై మూవీ బృందం మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: