ఆ వయసులో అదే నాకు ప్రపంచం... ఆ విషయంలో చాలా బాధపడేదాన్ని రితిక..!

MADDIBOINA AJAY KUMAR
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రితికా సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన గురు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడం , అందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు. 
కానీ ఈమెకు గురు సినిమా తర్వాత తెలుగు లో పెద్దగా అవకాశాలు ఏమీ రాలేదు. దానితో ఈమె తమిళ సినీ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది. 

అందులో భాగంగా ఇప్పటికే ఈమె అనేక తమిళ సినిమాలలో నటించింది. వాటిలో కొన్ని విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం కూడా ఈమె వరస తమిళ సినిమాలలో నటిస్తూ కెరీర్ను ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన చిన్న తనం గురించి , ఆ సమయంలో ఉన్న పరిస్థితుల గురించి వివరించింది. తాజాగా రితీక మాట్లాడుతూ... నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మేము ముంబై అవుట్ కాట్స్ లో ఉండేవాళ్లం. స్కూలుకు వెళ్లాలి అంటే ముంబై మెట్రోలో నాకు రెండు గంటలు పట్టేది.

కష్టం తర్వాత స్కూల్ కి చేరుకున్నాక కూడా నాకు క్లాస్ రూమ్ లో ఉండాలి అని అస్సలు అనిపించకపోయేది. ఎందుకు అంటే ఆ వయసులో నాకు కరాటేనే ప్రాణం. ఎప్పుడూ వెళ్లి కరాటే నేర్చుకోవాలా అని నా మనసులో ఉండేది. మా ఫ్యామిలీ లో చాలా మంది కరాటే ఫీల్డ్ నుండే వచ్చారు. ఉదయాన్నే లేచి వ్యాయామం చేసేదాన్ని. మా నాన్న గారే మాకు స్ఫూర్తి. కాలేజీలో కూడా స్పోర్ట్స్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని. నాకు స్నేహితులు ఎవరూ లేరు. స్నేహితులు లేనందుకు చాలా బాధపడే దాన్ని. స్పోర్ట్స్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చదువును నేను ఎప్పుడూ నెగ్లెట్ చేయలేదు అని తాజాగా ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: