కేసీఆర్: బ్లాక్ బుక్ మొదటి పేజీలో మంత్రి పొన్నం పేరు?

Veldandi Saikiran
మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజకీయాలు కొనసాగగా...  ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బ్లాక్ బుక్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. వైసిపి పాలనలో...  తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడడం జరిగింది. ఈ నేపథ్యంలో రెడ్బుక్ లో వైసిపి నేతలు అలాగే అధికారుల పేర్లను నారా లోకేష్ రాసుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారి తాట తీసే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇక ఇప్పుడు...  తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా...  బ్లాక్ బుక్ సంస్కృతిని తీసుకువచ్చారు. తెలంగాణ మంత్రుల అన్యాయాలు... పోలీస్ అధికారుల దౌర్జన్యాలను... ఆ బ్లాక్ బుక్ లో రాస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు చుక్కలు చూపిస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి. ఆర్టీసీలో అవినీతి, ఇసుక స్కాం, తాజాగా ఫ్లై యాష్  కుంభకోణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇరుక్కున్నారని... ఆరోపణలు చేస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి.
అయితే ఈ ఆరోపణలపై... పొన్నం ప్రభాకర్ స్పందించకుండా హుజురాబాద్ కాంగ్రెస్  పార్టీ అభ్యర్థి ఒడితల ప్రణయ్ తో సవాల్  విసిరించేలా చేశారు. అయితే దానికి కౌంటర్ గా పాడి కౌశిక్ రెడ్డి...  హుజరాబాద్ లోని ఓ హనుమాన్ టెంపుల్లో  ప్రమాణ స్వీకారం చేయాలని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. వెంటనే ఆ హనుమాన్ టెంపుల్ కు పొన్నం ప్రభాకర్ రావాలని.. స్కాములు చేయలేదని ప్రమాణం చేయాలని..  పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. దీంతో తోక ముడిచిన  పొన్నం ప్రభాకర్... ఈ విషయంపై స్పందించడమే మానేశారు.

 

ఇక ఇవాళ... ఈ పంచాయతీని హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి తీసుకువచ్చారు పాడి కౌశిక్ రెడ్డి. హుజురాబాద్ రాలేదు కదా... జూబ్లీహిల్స్ వెంకటేశ్వర టెంపుల్ కు రావాలని వెంటనే పాడి కౌశిక్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు.  ఉదయం 11 గంటలకు రావాలని సవాలు విసిరినా కూడా పొన్నం ప్రభాకర్ రాలేదు. తడి బట్టలతో... నిన్న ప్రమాణం చేసిన పాడి కౌశిక్ రెడ్డి.. ఇవాళ హైదరాబాదులో కూడా చేశారు. జూబ్లీహిల్స్ టెంపుల్ కు పొన్నం ప్రభాకర్ రాకపోవడంతో... బ్లాక్ బుక్ లో మొదటి పేజీలో పొన్నం ప్రభాకర్ పేరు రాస్తున్నట్లు మీడియాకు తెలిపారు కౌశిక్ రెడ్డి. ఇక దీనిపై పొన్నం ప్రభాకర్ ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: