ఎట్టకేలకు నెరవేరిన రష్మీక కోరిక.. ఈ దెబ్బతో నేషనల్ క్రష్ ను ఆపడం కష్టమే..?

MADDIBOINA AJAY KUMAR
నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత క్రేజ్ కలిగిన ముద్దుగుమ్మలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఈమె కన్నడ సినిమాల ద్వారా సినీ ప్రస్తానాని మొదలు పెట్టింది. అందులో భాగంగా కిరిక్ పార్టీ అనే మూవీతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ విజయంతో ఈమెకు కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమా విజయం తర్వాత ఈమె కన్నడ సినిమాలలో నటించకుండా తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన సినిమాలలో చాలా మూవీలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడంతో ఈమె చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళిపోయింది.

కొంత కాలం క్రితం ఈమె పుష్ప పార్ట్ 1 అనే పాన్ ఇండియా మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈమెకు నార్త్ లో కూడా క్రేజ్ బాగానే వచ్చింది. దానితో ప్రస్తుతం ఈమె వరుస హిందీ సినిమాలలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సికిందర్ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఈమె కొంతకాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనను నేను నేరుగా ఎప్పుడూ కలుసుకోలేదు. ఆయన డాన్స్ కూడా నేను నేరుగా ఇప్పుడు చూడలేదు.

కాకపోతే చాలామంది అంటుంటారు ఆయన ఏ మాత్రం ప్రాక్టీస్ చేయకుండా నేరుగా వచ్చి డాన్స్ చేస్తుంటారు అని, అలాగే డైరెక్టర్లు ఇచ్చిన డైలాగ్ లను కూడా బట్టి పట్టకుండా ఒక్క సారి చూసి చెప్పేస్తాడు అని కూడా అందరూ అంటుంటారు. అంత గొప్ప నటుడు మరియు డాన్సర్ అయినటువంటి ఎన్టీఆర్ సినిమాలో నటించాలని కోరికగా ఉంది అని ఆమె చెప్పింది. ఇక ఈమె కోరిక చాలా తొందరగానే నెరవేరింది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ త్వరలో స్టార్ట్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో ఈమెనే హీరోయిన్గా మేకర్స్ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే ఈమెను హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లు అయితే ఈ ముద్దుగుమ్మ కోరిక నెరవేరినట్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rm

సంబంధిత వార్తలు: