తెలంగాణలో విషాదం.. సీనియర్ నాయకులు కన్నుమూత

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తీవ్రవిసాదం చోటుచేసుకుంది. రాజకీయ కురువృద్ధుడు, సీనియర్ నాయకులు... ధర్మపురి శ్రీనివాస్ ఇకలేరు. ఇవాళ తెల్లవారుజామున.. తెలంగాణ రాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకులు ధర్మపురి శ్రీనివాస్ మరణించారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో.. ధర్మపురి శ్రీనివాస్ కు గుండెపోటు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే ఆయన ఇంట్లోనే మరణించినట్లు.. చెబుతున్నారు.
 

అయితే మూడు గంటలకు మరణించినట్లు కుటుంబ సభ్యులు అయితే నిర్ధారించారు. గత కొన్ని రోజులుగా... ధర్మపురి శ్రీనివాస్... చాతికి సంబంధించిన  వ్యాధితో బాధపడుతున్నారు. ఊపిరి పీల్చుకోవడం, గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా ఉన్నాయట.  దీంతో నెలలో రెండు సార్లు అయినా... అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలు అయ్యేవారు డి శ్రీనివాస్. అయితే ఇవాళ ఉదయం 3 గంటల సమయంలో... అందరూ పడుకున్న సమయంలో గుండెపోటు వచ్చిందట.

ఇక ఈ వార్త తెలియగానే... పలువురు రాజకీయ నాయకులు... ధర్మపురి శ్రీనివాస్ కు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. కాగా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణ రాష్ట్రంలో... అనేక పదవులను... పొందారు శ్రీనివాస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ఎంపీగా అలాగే మంత్రిగా కూడా పని చేశారు.
 

అదే సమయంలో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా కూడా శ్రీనివాస్ పని చేశారు. సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడిగా కూడా ధర్మపురి శ్రీనివాస్ మెదిగారు. అయితే తెలంగాణ రాష్ట్రం.. ఏర్పాటు నేపథ్యంలో... కాంగ్రెస్ ను వీడి గులాబీ పార్టీకి చేరారు ధర్మపురి శ్రీని వాస్. ఈ సమయంలోనే... ధర్మపురి శ్రీనివాస్ కు కెసిఆర్ అనుచిత స్థానం కల్పించారు. రాజ్యసభ పదవి ఇచ్చి గౌరవించారు. అయితే ఆ తర్వాత... కెసిఆర్ కు వ్యతిరేకంగా... వ్యవహరించి పార్టీ నుంచి వెళ్ళిపోయారు డి శ్రీనివాస్. కాగా ధర్మపురి శ్రీనివాస్ కొడుకు... ధర్మపురి అరవింద్ ఎంపీగా ఉన్న సంగ తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: