ఏపీ: పెన్షన్ ఇవ్వడంలో కక్కుర్తి.. చేతివాటం చూపించిన అధికారులు..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం గా చేసిన మొదటి సంతకాలలో పింఛన్ పెంపు వ్యవహారం కూడా ఒకటి. ఈ పింఛన్ పెంపు విధానాన్ని ఈనెల 1వ తారీఖున అంటే ఈ రోజున పెంచిన పింఛన్ ని అందరికీ పంచడం జరిగింది. అలా వృద్ధాప్య పింఛన్ ని 7వేల రూపాయలు ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక వికలాంగులకు 6000 ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పింఛన్ వ్యవహారాన్ని సచివాలయ ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగులకు కేటాయించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

తాజాగా ఈ పింఛన్ పంచే వ్యవహారంలో కూడా కొంతమంది అధికారులు కక్కుర్తి  పడినట్లుగా తెలుస్తోంది. పల్నాడు జిల్లా మాచర్ల లో పింఛన్ దారుల వద్ద సచివాలయ ఉద్యోగి చేతివాటం చూపించినట్లుగా తెలుస్తోంది. పెన్షన్ తీసుకునే వారి వద్ద నుంచి సుమారుగా 500 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సచివాలయ ఉద్యోగి వాలు నాయక్ తన చేతి వాటం చూపించారు. మాచర్ల నియోజకవర్గం లో 9వ వార్డు సచివాలయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నడు  ముదావత్ వాలు నాయక్ ఈ పని చేసినట్లుగా సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న వెంటనే అక్కడ అధికారులు వాలు నాయక్ పైన పలు రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. వెంటనే సస్పెండ్ చేసి మున్సిపల్ కమిషనర్ పరిధిలోకి అతనిని తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో పండుగలాగా జరుగుతున్న ఈ పెన్షన్ కార్యక్రమన్ని టిడిపి నేతలు కార్యకర్తలు సైతం చాలా గ్రాండ్గా సచివాలయాలలో చేస్తూ ఉన్నప్పటికీ ఇలాంటి సచివాలయ ఉద్యోగులు సైతం పెన్షన్ పంచడంలో కక్కుర్తి  చూపిస్తూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇలాంటివి ఏవి జరగకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి. ఏది ఏమైనా అన్న మాటని సైతం చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: