బాబు - రేవంత్ భేటీ... కేసీఆర్, కేటీఆర్‌కు టెన్ష‌న్ ఎందుకు ?

RAMAKRISHNA S.S.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకప్పటి గురు శిష్యులు అయిన.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. త్వరలో భేటీ కానున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, రాజకీయ అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మరి ముఖ్యంగా విభజన సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఈనెల 6న సమావేశం అవుతుండడంతో.. తమకు కావాల్సినంత స్ట‌ఫ్ దొరుకుతుందని బీఆర్ఎస్ పార్టీ ఎంతో ఆశతో ఎదురుచూస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన కల్లోల పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ అయితే దానిని చిలువలు, పలువులు చేసి మానసిక ఆనందం పొందాలని.. బీఆర్ఎస్ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. జగన్, కేసీఆర్ ఎంత స్నేహంగా ఉన్నా.. గత ఐదేళ్లలో విభజన సమస్యల పరిష్కారం కోసం వీరిద్దరూ కలిసి ఒక్క అడుగు కూడా వేయలేదు. అసలు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడంతో.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుంటున్నారు. దీనిని పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మెచ్చుకోవాల్సింది పోయి.. రాజకీయపరమైన విమర్శలు చేసి లబ్ధి పొందాలని చూడటం అవివేకం అవుతుంది.

ఈ ఇద్దరు ముఖ్యమంత్రి తర్వాత విభజన సమస్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కానీ.. ఈ సమావేశం ఇప్పుడు కెసిఆర్, కేటీఆర్ ను మాత్రం తెగ టెన్షన్ పెట్టేస్తోంది. ఏది ఏమైనా వీరిద్దరి బేట్టి తర్వాత ఏదో ఒక సెంటిమెంట్ పండించి రాజకీయంగా కాస్త లైవ్ లోకి రావాలని కేసీఆర్, కేటీఆర్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా అయితే వీరిద్దరు భేటీ కోసం కాచుకుని కూర్చుంది. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేసే వారి తాటతీస్తానని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి దీనిపై బిఆర్ఎస్ సోషల్ మీడియా ఏం చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: