కోహ్లీ మొబైల్ వాల్ పేపర్ పై బాబా ఫోటో.. ఇంతకీ ఎవరీ కరోలి బాబా?

praveen
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే తన ఆటతీరుతో  ప్రపంచవ్యాప్తంగా కూడా సుపరిచితుడుగా మారిపోయాడు ఈ స్టార్ క్రికెటర్. ప్రస్తుతం టీమిండియాలో మూడు ఫార్మర్లలో కూడా కీలక ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు. ఇక ఇటీవల టీమిండియా కు t20 వరల్డ్ కప్ అందించడంలో కూడా కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి. అయితే ఇక మొన్నటికి మొన్న తన అంతర్జాతీయ టి20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు ఈ స్టార్ ప్లేయర్.

 వన్డేలు t20 ఫార్మట్లలో మాత్రం కొనసాగుతాను అని చెప్పాడు. అయితే విరాట్ కోహ్లీ గురించి ఏ విషయం తెరమీదకి వచ్చిన సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. కాగా ఇప్పుడు కోహ్లీ గురించి ఒక పర్సనల్ విషయం ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. సాధారణంగా విరాట్ కోహ్లీకి భక్తి భావం ఎక్కువ అన్న విషయం తెలిసిందే. కాస్త ఖాళీ సమయం దొరికింది అంటే చాలు తన భార్య అనుష్క శర్మతో కలిసి దేవాలయాలకు వెళ్లి ఇక భక్తి పారవశ్యంలో  మునిగిపోతూ ఉండడం ఎన్నోసార్లు చూశాం. అయితే ఇటీవల విరాట్ కోహ్లీ ఫోన్ వాల్ పేపర్ పై ఏకంగా ఒక బాబా ఫోటో ఉండడం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 ఇలా స్టార్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ మొబైల్ వాల్ పేపర్ గా నీమ్ కరోలి బాబా ఫోటోని ఉంచుకున్నాడు. అయితే ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో నీమ్ కరోలి బాబా ఎవరు అని తెలుసుకోవడానికి అందరూ సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు. యూపీలో జన్మించిన ఈయన పేరు లక్ష్మణ్ నారాయణ శర్మ. చిన్నతనంలోనే సాధువుగా మారారు. తన ప్రవచనాల ద్వారా లక్షణాదిమంది భక్తులను సొంతం చేసుకున్నారు. 1973 లోనే ఆయన మరణించారు. అయితే విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి పలుమార్లు ఇప్పటికే నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించారు. ఇక ఇలా వాల్ పేపర్ పై ఫోటో పెట్టుకోవడం చూస్తే ఆ బాబాని  కోహ్లీ ఎంతగానో ఆరాధిస్తారు అనేది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: