లగ్జరీ కారు కొన్న తెలుగు సీరియల్ నటి.. దరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
ఒకప్పుడు సీరియల్స్ హీరోయిన్ లకి పెద్దగా పారితోషకాలు ఉండేవి కావు. అలాగే వారికి పెద్దగా గుర్తింపు కూడా ఉండేది. కానీ కాలం మారింది. ఇప్పుడు సీరియల్ హీరోయిన్ లకి కూడా సినిమా హీరోయిన్ ల స్థాయిలో క్రేజ్ ఉంటుంది. అలాగే కొంత మంది కి పారితోషకాలు కూడా గట్టిగానే ఇస్తున్నారు. దానితో సినిమా హీరోయిన్స్ స్థాయిలో కాకపోయినా మంచి స్థాయిలోనే వారి జీవితం కూడా ముందుకు నడుస్తోంది. చాలా మంది సీరియల్ హీరోయిన్స్ కోట్లు ఖర్చు పెట్టి కార్లు కొంటున్నారు , విలాసమంతమైన భవనాలు కొంటున్నారు.

ఇక ఆ లిస్టు లోకి తాజాగా లహరి కూడా చేరిపోయింది. ఈమె తెలుగు లో అత్యంత బ్లాక్ బాస్టర్ సీరియల్ లలో ఒకటి అయినటువంటి మొగలి రేకులు సీరియల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ సీరియల్ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగులో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ప్రస్తుతం ఈమె అనేక సీరియల్లో నటిస్తూ ఫుల్ బిజీ నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే తాజా గా ఈమె అత్యంత లగ్జరీస్ కారు ను కొనుగోలు చేసింది.

ఈమె కొనుగోలు చేసిన కారు ధర దాదాపు 90 లక్షల వరకు ఉంటుంది అని మరియు కొన్ని చార్జీలతో కలిపి దీని ధర దాదాపు కోటి రూపాయల వరకు వెళ్లే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇక తాజాగా ఈమె కొన్న కారు ముందు నిలుచొని ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఈమె తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈమె సీరియల్స్ లో నటించడం మాత్రమే కాకుండా యూట్యూబ్ ఛానల్ కూడా మైంటైన్ చేస్తుంది. అలా ఈమె సీరియల్స్ , యూట్యూబ్ ఛానల్ ఈ రెండింటి ద్వారా రెండు చేతుల బాగానే సంపాదిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: