పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర రూ. 866 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా డీసెంట్ రెస్పాన్స్ దక్కుతోంది. ప్రభాస్ నటించిన సినిమాల్లో నాలుగు సినిమాలు ఐదు వందల కోట్ల మార్క్ ని దాటిన మూవీస్‌గా నిలిచాయి. బాహుబలి 2 రూ.1814కోట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో కల్కి 2898 ఏడీ నిలిచింది. ఇది రూ.865 కోట్లు వసూలు చేసింది. బాహుబలి ` రూ.630 కోట్లతో మూడో స్థానంలో ఉంది. `సలార్ రూ.623కోట్లతో మూడో స్థానంలో ఉండగా, నాలుగు సినిమాలకు రూ.500కోట్లకుపైగా కలెక్షన్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు ప్రభాస్.
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినిదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడం జరిగింది. పైగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరి సూపర్ స్టార్స్ ఈ సినిమాలో నటించారు. దీపికా పడుకోన్, దిశా పటాని లాంటి హాట్ హీరోయిన్లుగా నటించారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు. మహాభారతన్ని రాబోయే ఫ్యూచర్ ని యాడ్ చేసి చూపించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నాడు. అశ్వాద్దామాగా అమితాబ్ ని చూపించిన తీరు అద్భుతం. అలాగే కామియో రోల్స్ ని కూడా నాగ్ అశ్విన్ చాలా అద్భుతంగా చూపించడంతో ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు.తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లకు పైగా రాబట్టిన కల్కి... ఇక హిందీలో కూడా ఇప్పటిదాకా ఈ సినిమా రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆదివారం నాడు రూ. 20 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తుంది.