కల్కి విజయం వెనుక మన తెలుగు మీడియా పాత్ర ఏమిలేదా?

Suma Kallamadi
దాదాపుగా ఇండియాలో ఓ రెండు వారాలుగా కల్కి సినిమా గురించే సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి' సినిమా ఎంతటి భారీ విజయం నమోదు చేసిందో ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు ₹800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఇక వచ్చే వారం వరకూ బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడంతో ఈజీగా ₹1000 కోట్ల మార్క్ క్రాస్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే ఇండియన్ సినిమాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-5 చిత్రాల జాబితాలో కల్కి చేరబోతోంది. ఈ తరుణంలోనే ఈ మూవీ ఇంత పెద్ద సక్సెస్ అందుకోవడంలో 'తెలుగు మీడియా' పాత్ర ఎంత ఉందనే విషయం పైన మన మాట్లాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
అవును, తెలుగు మీడియా 'కల్కి 2898 AD' చిత్రాన్ని తన భుజాలపైకి ఎత్తుకుంది. ఎంతో బాగున్న తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలానే ఉద్దేశ్యంతో, మీడియా సైతం తమవంతు సపోర్ట్ చేస్తూ తన వంతు పాత్రని పోషించింది. ఎప్పటికప్పుడు 'కల్కి'కి సంబంధించిన వార్తలకు ప్రాధాన్యం ఇస్తూ ఎక్కువగా న్యూస్ పబ్లిష్ అయ్యేలా జాగ్రత్త పడింది. ఈ క్రమంలో వెబ్ సైట్స్, సౌండ్ టీవీ ఛానల్స్, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా 'కల్కి' ప్రమోషనల్ మెటీరియల్ ను ప్రచారం చేస్తూ.. ఈ ప్రాజెక్ట్ గురించి ట్రేడ్ లో చర్చ జరిగేలా చేశాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి. ఈ విషయాలే ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అవ్వడానికి కారణమయ్యాయి. లేదంటే కనీసం ప్రి రిలీజ్ ఫంక్షన్ చేయనటువంటి ఈ సినిమాకి అంత హైప్ వచ్చేది కాదు.
ఇటువంటి విషయాలనే బాలీవుడ్ మీడియా కూడా ఫాలో అవ్వడంతో.. నార్త్ ఇండియా నుంచి నార్త్ అమెరికా వరకూ అందరూ కల్కి గురించే చర్చించుకుంటున్న పరిస్థితి. అంతేకాకుండా సినిమా రిలీజ్ తర్వాత కూడా 'కల్కి 2898 AD' చిత్రానికి తగినంత పబ్లిసిటీ ఇచ్చింది తెలుగు మీడియా. సినిమాలో అక్కడక్కడా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, వాటిని ఎక్కడా హైలైట్ చేయకుండా అందరూ సానుకూల సమీక్షలు రాశారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్టాండర్డ్స్ లో రూపొందించిన సినిమా అంటూ గొప్పగా కీర్తించారు. కట్ చేస్తే దీనికి పాజిటివ్ టాక్ కూడా తోడవడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదవుతున్నాయి. మరోవైపు మౌత్ టాక్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. చూసిన పదిమందిలో దాదాపు 9 మంది కల్కి సినిమా అదుర్స్ అంటూ కొనియాడడం శుభపరిణామం!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: