కావ్యతో చిందులేస్తున్న రామ్... ఆ రేంజ్ లో రెచ్చిపోతున్న జంట..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని "ఈస్మార్ట్ శంకర్" మూవీతో మంచి విజయం అందుకున్నాడు. ఈ మూవీ కంటే ముందు ఈయన నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ వచ్చాయి. పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాతో ఫుల్ కం బ్యాక్ అయ్యాడు. కానీ ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలాగే ఈస్మార్ట్ శంకర్ మూవీ తో మంచి విజయం అందుకున్న రామ్ కూడా ఈ మూవీ తర్వాత ది వారియర్ , స్కంద అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలలో హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలు కూడా ఈ నటుడుకి బాక్స్ ఆఫీస్ దగ్గర చేదు అనుభవాన్ని మిగిల్చాయి.

ఇలా ఈస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత రామ్ నటించిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడం, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఒక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం చెందడంతో వీరిద్దరూ కలిసి ప్రస్తుతం బ్లాక్ బాస్టర్ మూవీ అయినటువంటి ఈస్మార్ట్ శంకర్ సినిమాకు కొనసాగింపుగా డబల్ ఈస్మార్ట్ అనే మూవీ ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని కావ్య దాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అవుతున్న ఒక హీట్ కూడా దక్కలేదు.

ఈ సినిమా హిట్ అయితే ఈమెకు కూడా మంచి గుర్తింపు దక్కుతుంది. ఇలా డబల్ ఈస్మార్ట్ మూవీ తో విజయం సాధించాలి అని రామ్, కావ్య, పూరి ముగ్గురు కూడా కసితో పని చేస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఈ మూవీ బృందం ప్రస్తుతం రామ్ పోతినేని మరియు కావ్య దాపర్ పై అల్యూమినియం ఫ్యాక్టరీలో సాంగ్ ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ ఈ సినిమాలో హైలైట్ గా ఉండబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: