టీమిండియాని భయపెడుతున్న.. మార్క్ రమ్ ట్రాక్ రికార్డ్?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఎన్నో రోజులుగా ప్రేక్షకులందరికీ అలరిస్తూ వస్తున్న టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ ప్రస్తుతం తుది అంకానికి చేరుకుంది. ఎన్నో రోజులుగా మ్యాచ్ లు ఉత్కంఠ భరితంగా సాగుతూ వస్తుండగా ఇక ఇప్పుడు.. నేడు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఆఫ్గానిస్థాన్ ను ఓడించి సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ ను ఓడించి ఫైనల్ లో అడుగుపెట్టాయి.

 ఈ క్రమంలోని వరల్డ్ కప్ టైటిల్ కోసం నేడు ఫైనల్ పోరులో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి అని చెప్పాలి. అయితే 2023 వరల్డ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన భారత జట్టు 2024 t20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడేందుకు సిద్ధమవుతుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కప్పు గెలవాలని పట్టుదలతో ఉంది. అయితే టీమిండియా ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు వచ్చి దాదాపు 10 ఏళ్లు పూర్తవుతుంది. 2014లో విరాట్ కోహ్లీ విరోచీత పోరాటంతో అప్పట్లో ఫైనల్ లోకి వచ్చింది.  కానీ కప్పు మాత్రం గెలవలేకపోయింది. ఇంకోవైపు సౌత్ ఆఫ్రికా మొట్టమొదటిసారి ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ కు వచ్చింది అని చెప్పాలి  అయితే ఫైనల్ పోరుకి ముందు అటు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్ రమ్ ట్రాక్ రికార్డు భారత జట్టును భయపెడుతుంది.

 2014లో అండర్ 19 వరల్డ్ కప్ గెలిచి సౌత్ ఆఫ్రికా జట్టుకి మొదటి ఐసిసి ట్రోఫీ అందించాడు మార్కరమ్. ఆ టోర్నీలో ఆరు మ్యాచ్లకు గాను ఆరు మ్యాచ్ లలో గెలిచి దక్షిణాఫ్రికా రికార్డు సృష్టించింది. ఇక సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో మార్కరమ్ కెప్టెన్సీ లోనే సన్రైజర్స్ వరసగా రెండుసార్లు విజేతగా నిలిచింది. 2023 వన్డే వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్లకు తాత్కాలిక కెప్టెన్ గా జట్టును ముందుకు నడిపించిన మార్కరమ్ రెండు మ్యాచ్ లలో గెలిపించాడు. దీంతో అతని ట్రాక్ రికార్డ్ గా టీమిండియా కు ఆందోళనకరంగా మారిపోయింది. 2024 t20 వరల్డ్ కప్ టోర్నీ లోను సౌత్ ఆఫ్రికా ఘన విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తూ ఫైనల్ వరకు వచ్చింది. ఇలా సౌత్ ఆఫ్రికా ను ఫైనల్ కు చేర్చిన మొదటి సారథిగా మార్కరం నిలిచాడు. మరి ఇప్పుడు అతను కప్పు అందించేందుకు సిద్ధమయ్యాడు. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: