ఎర్రచందనానికి బయట అంత సీన్ లేదు పుష్ప.. అసలు కారణం ఇదే..?
టన్ను ధర రూ. 70 లక్షలుగా నిర్ధారణ ..
రూ. 50 లక్షలుగా కోట్ చేసిన వ్యాపారులు ..
చందనం కొనుగోలు చేసే దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉండటమే కారణం ..!
అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్లో వచ్చి పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు బద్దలు కొడుతున్న పుష్ప 2 సినిమా స్టోరీ మొత్తం ఎర్రచందనం చుట్టూనే తిరుగుతుంది .. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి కోట్లకు కోట్లు రేటు పలుకుతున్నట్లు చూపిస్తారు .. అయితే నిజానికి దానికి అంత సీన్ లేదని ఇప్పుడు తేలిపోయింది .. స్మగ్లర్ల నుంచి ఏపీ యాంటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు గత పదేళ్లలో స్వాధీనం చేసుకున్న 5376 టన్నుల ఎర్రచందనం విక్రయానికి పెట్టగా అనుకున్న అంత స్థాయిలో డిమాండ్ రాకపోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ మొత్తం ఎర్రచందనం దుంగల్లో కొంత మొత్తాన్ని గ్లోబల్ ట్రెండర్ ద్వారా విక్రయించాలని గత ఏడాది రాష్ట్ర అటవీశాఖ ప్రయత్నించింది .. అయితే టెండర్ వేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో నిరాశ ఎదురయింది .. ఇక ఇప్పుడు తాజాగా 95 టన్నులను విక్రయించేందుకు టెండర్లను ఆహ్వానించిన అంతగా స్పందన రాలేదు .. ఇక ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదు .. ఎర్రచందనం టన్ను ధరను అటవీశాఖ 70 లక్షలు గా నిర్ణయించుగా..
ఇక ఎక్కువ మంది వ్యాపారులు 50 లక్షలకు మించి బిడ్లు వేయటం లేదు. ఇక టెండర్ రేటుకు బీడ్లు వేసిన ఒకరిద్దరు వ్యాపారులు కొనుగోలు చేసింది కూడా 30% సరుకే . ఇక 2016 - 9 మధ్య టన్ను ఎర్రచందనం ధర .. 70 నుంచి 75 లక్షల వరకు పలికింది .. కానీ ఇప్పుడు అమంతం 20 లక్షలకు తగ్గిపోయింది. అయితే ఇందుకు చైనా , జపాన్ , మలేషియా , సింగపూర్ , అరబ్ దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉండటమే కారణమని అధికారులు చెబుతున్నారు.