శ్రీలీల ఫస్ట్ టార్గెట్ ఆ బ్యూటీనేనా..?

MADDIBOINA AJAY KUMAR
ఎంతో మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే అదృష్టం భారీ స్థాయిలో ఉంటుంది. అలాంటి వారు నటించిన మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంటారు. ఆ తర్వాత హిట్ , ఫ్లాప్ లతో సంబంధం లేకుండా క్రేజీ సినిమా అవకాశాలను కొట్టేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఇలాంటి వారిలో శ్రీ లీల ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా అయినటువంటి పెళ్లి సందD తోనే ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఆ తర్వాత నుండి ఈమెకు వరస సినిమా అవకాశాలు రావడం మొదలు అయింది. ఈమె నటించిన సినిమాలలో ఒకటి , రెండు తప్పితే పెద్దగా ఏవి విజయాలను అందుకోలేదు. అయినప్పటికీ ఈమెకు సినిమా అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈమె ప్రస్తుతం తెలుగు లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే వస్తుంది. ఈమె నటించిన సినిమాలు సంవత్సరానికి మూడు , నాలుగు చొప్పున విడుదల అవుతున్నాయి. దానితో ఇంత కాలం పాటు తెలుగు లో రష్మిక మందన వరుస సినిమాలతో కొనసాగింది. ఈమె స్థానాన్ని ఇప్పటికే తెలుగు లో ఈమె కొట్టేసినట్లు అవుతుంది.

ఈ రోజు కూడా శ్రీ లీల కొత్త సినిమా ఒకటి ప్రారంభం అయింది. రవితేజ ఈ సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈమెకి నిజంగానే హిందీ సినిమాలలో కూడా వరుసగా అవకాశాలను దక్కించుకున్నట్లు అయితే అక్కడ కూడా రష్మిక స్థానాన్ని ఈమె డామినేట్ చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈమె జోరు చూస్తూ ఉంటే ఇటు తెలుగు అటు హిందీ రెండిట్లో కూడా రష్మిక ను డామినేట్ చేసే లాగానే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: