నల్లగా ఉన్నానని నా కూతురు బాధ పడింది.. ఆమెని మార్చింది ఆ బయోగ్రఫీనే.. స్టార్ హీరో భార్య‌ కామెంట్స్..!

lakhmi saranya
నల్లగా ఉన్నారని లేకపోతే లావుగా ఉన్నారని కొందరు చాలా మందిని హేళన చేస్తూ ఉంటారు. అటువంటి టైంలో కొందరు డిప్రెషన్స్ కి గురవుతారు కూడా. అలా డిప్రెషన్ కి గురై ఇంట్లో నుంచి బయటికి రాకపోవడం లేకపోతే ఎవరితోనూ కలవకపోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితి స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూతురుకు కూడా వచ్చింది. తాజాగా ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ భార్య మరియు నటి, రచయితీ ట్వింకిల్ తన పోయి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఇవి మాట్లాడుతూ.." నా కూతురు నితార స్విమ్మింగ్ క్లాసులకు వెళ్ళేది. కానీ ఒకసారి సడన్గా వెళ్లడం మానేసింది. అంతేకాకుండా ఎండలో టాన్ అయిపోయి నల్లగా అయిపోతున్నాను.. అన్నయ్య లాగా తెల్లగా అవుతాను అంటూ చెప్పుకొచ్చింది. నేను షాక్ అయ్యాను. అనంతరం అసలు విషయం తెలిసింది. మా బంధువు ఒకరు మీ పాప చాలా క్యూట్ గా ఉంది కానీ ఆరవ్ లాగా తెల్లగా లేదు అని అన్నది. ఆ మాట విన్న నితార ఇలా ఆలోచించడం మొదలు పెట్టింది. తనకు నేను రంగు ముఖ్యం కాదని చెప్పాలని అనుకున్నాను.
అప్పుడు ఫ్రీదా ఖలో బయోగ్రఫీని ఆమెకు ఇచ్చిన చదవమని చెప్పాను.హ ఆ బయోగ్రఫీ ఒక మెక్కికన్ పెయింటర్. మనిషి శరీరం మరియు ఐడెంటిటీ, మరణం, వ్యక్తిత్వం ఎలా చాలా విషయాలు గురించి ఆమె అందులో రాసింది. ఆ పుస్తకం చదివాక నా కూతురి లో చాలా మార్పు వచ్చింది. తెలుపు అంటే లైట్ కలర్ అది త్వరగా మారిపోతుంది. నలుపు డార్క్ కలర్. అది అంతా త్వరగా మాసిపోదు అని ఆమె తెలుసుకుంది " అంటూ చెప్పుకొచ్చింది. ప్రెసెంట్ ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలను చూసిన వారంతా మంచిపని చేశారు అంటూ పొగుడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: