ఓటిటి ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసుకున్న సత్యభామ మూవీ.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..!

lakhmi saranya
టాలీవుడ్ చందమామగా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ తాజాగా నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం సత్యభామ. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి టాక్ని సంపాదించుకుంది. తొలిరోజు  సత్యభామ మూవీ కోటికి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాతోనే సుమన్ డైరెక్టర్గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
వివాహం అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాజల్ అగర్వాల్ చేసిన మొట్టమొదటి లేడీ ఓరియంటెడ్ సినిమా. గతంలో కూడా కాజల్ లేడీ ఓరియంటెడ్ సినిమా ఎప్పుడు చేయలేదు. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ఈ మూవీ పై ప్రతి ఒక్కరి దృష్టి మళ్లింది. ఇక రిలీజ్ అనంతరం ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ యొక్క ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ అయింది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సత్యభామ ఓటిటి హక్కులను ఆహా సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.
థియేటర్లలో తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రం ఓటిటిలో మాత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కాబోతున్నట్లు సమాచారం. థియేటర్లలో రిలీజ్ అయిన 4 వారాల తరువాత సత్యభామ మూవీ ఓటిటి రిలీజ్ కానుంది. జులై ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ నుంచి ఈ మూవీ ఆహా లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ నెలాఖరున సత్యభామ ఓటిటి రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇక ఈ మూవీలో పోలీస్ క్యారెక్టర్ లో తన నటనతో అదరగొట్టిన కాజల్ అగర్వాల్ విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంటుంది. ఇక థియేటర్లలో ఈ మూవీ జోరుగా కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: