సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆయనని నేను మరవలేను.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్..!

lakhmi saranya
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నందమూరి వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన తారక్ ప్రెసెంట్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ప్రెసెంట్ ఏపీలో జరుగుతున్న ప్రతి ఒక్కదానిపై తారక్ స్పందిస్తూ తనదైన రీతిలో ట్వీట్ చేస్తున్నాడు.
ఇక తాజాగా ఈనాడు, రామోజీ ఫిల్మ్ సిటీ, మార్గదర్శి సంస్థల అధినేత రామోజీరావు శనివారం ఉదయం అనారోగ్య సమస్యతో కన్నుమూశారు. ప్రస్తుతం ఈయనకి 88 ఏళ్లు. కాదా ఆయన మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. " శ్రీ రామోజీ రావు గారు ఇలాంటి దార్మనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియు భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పోర్చలేనటువంటిది. ఆయన మన మధ్య ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం.
నిన్ను చూడాలని చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమ కి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేను. ఆ మహానీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను " అంటూ తన ట్విట్టర్లో రాసుకు వచ్చాడు ఎన్టీఆర్. ప్రజెంట్ ఎన్టీఆర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈయన మృతి పట్ల ఒక జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాకుండా పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ తమతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తున్నారు. ఇక ప్రజెంట్ దేవర షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నా ఎన్టీఆర్ అనంతరం వార్ 2 షూటింగ్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అనంతరం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మరో మూవీ చేయనున్నాడు తారక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: