బ్రాలో మందు తాగిన హీరో.. రాజమౌళి శిష్యుడు ఏమన్నాడు అంటే..?

lakhmi saranya
దర్శక ధీరుడు రాజమౌళి శిష్యుడు అయినా అవనీంద్ర డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే. నవదీప్ హీరోగా అవనీంద్ర డైరెక్షన్లో వచ్చిన మూవీ లవ్ మౌలి. జూన్ 7న విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ని సంపాదించుకుంది. అయితే ఈ మూవీ విడుదలకు ముందు ఇటీవల విడుదల చేసిన ఓ పోస్టర్లో హీరో నవదీప్ బ్రాలో మందు పోసుకుని తాగడం సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఓ ఇంటర్వ్యూలో బ్రాలో మందు  తాగడం పై డైరెక్టర్  అవనింద్ర ను ప్రశ్నించగా ఆయన చెప్పిన సమాధానం ఇంట్రెస్టింగ్ గా మారింది.
కదా రాసుకున్నప్పుడు మనం ఎవరినో ఒకరిని ఊహించుకుంటూ రాయాలి. ఈ కథకి అలా ఊహించుకోవడం చాలా కష్టం. ఈ ఒక్క కథకి ఎవరిని ఊహించుకోకుండా ఒక నవలలా కథ రాశా. ఆ తరువాత ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలు అందరినీ ఈ కథకి ఊహించుకుంటూ వచ్చాను. అయితే ఆ ఫోటోలలో అప్పుడు నవదీప్ ఫోటో లేదు. అప్పుడు నవదీప్ కూడా అంత యాక్టివ్గా సినిమాలు చేయడం లేదు. అప్పుడు నాకెందుకు నవదీప్ అయితే బాగుంటుంది అని ఆలోచన వచ్చింది. నా ఆలోచనలన్నీ అతనిపై పెట్టి ఆ తర్వాత వెళ్లి కథ చెప్పా. కదా వినగానే ఎగిరి గంతేశాడు. ఇలాంటి కథ కోసం ఎప్పటినుంచో చూస్తున్న అని చెప్పాడు.
నేను అనుకున్న లుక్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాడు. అయితే మార్కెట్ అవి ఇవి ప్రాబ్లమ్స్ ఉంటాయని అంతా అన్నారు. కానీ ఫస్ట్ సినిమా ఈ ఒక్క కథని నిజాయితీగా చేద్దామని ఫిక్స్ అయ్యాను. రిజల్ట్ తో సంబంధం లేదు. 10 ఏళ్ల తరువాత వెనక్కి తిరిగి చూసుకున్న ఫస్ట్ సినిమా నిజాయితీగా చేశానని చెప్పుకోవడానికి ఉంటుందని అనుకున్నాను. లో దుస్తులని పబ్లిక్ గా ఆరాయడానికి సంకోచించే మైండ్ మనది. నాకున్న స్క్రీన్ ప్లే టైం ని దృష్టిలో పెట్టుకుని హీరో క్యారెక్టర్ ఇది అని చెప్పడం కోసమే హీరో ఇన్నర్ దుస్తుల్లో మందు తాగడం చూపించడం జరిగింది.. అంటూ తెలిపాడు డైరెక్టర్. ప్రజెంట్ ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: