అకిరా తో ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడారో.. తెలిపిన రేణు దేశాయ్..!

lakhmi saranya
జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్డీఏ భాగస్వామ్య ‌ పక్షాల భేటీ సందర్భంగా తాజాగా చంద్రబాబుతో కలిసి ఢిల్లీ వెళ్లారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనతో పాటు తన సతీమణి అన్నా లెజినోవా తో పాటు కొడుకు అకిరా  నందన్ కూడా తీసుకెళ్లారు. ఇక అప్పటినుంచి అకిరా పేరు సోషల్ మీడియాలో మారు మోగుతుంది. ప్రధాన మోడీతో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అకిరా దిగిన ఫోటోలు ప్రెసెంట్ సోషల్ మీడియాని షేర్ చేస్తున్నాయి.
అంతేకాకుండా దీనిపై రేణు దేశాయ్ కూడా ఓ పోస్ట్ పెట్టింది. తనకు ఎంతో ఇష్టమైన నాయకుడు మోడీతో అఖీరా ఫోటో దిగడం చాలా సంతోషంగా ఉందని ఇంస్టాగ్రామ్ వేదికగా వీడియోని రిలీజ్ చేసింది రేణు దేశాయ్. ఇక ఈ సందర్భంగా ప్రేక్షకులు మోడీ అఖీరాతో ఏం మాట్లాడారో కూడా వీడియో చేసి పెట్టడం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. దీనిపై స్పందించిన రేణు దేశాయ్.." ఇంత హైట్ ఉన్నావు కదా.. బాస్కెట్బాల్ ఆడడం లేదు ఎందుకు అని అడిగితే అకిరా సిగ్గుపడ్డాడు " అంటూ రిప్లై ఇచ్చింది రేణు.
ప్రెసెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అకీరా నందన్ హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.  కానీ ఏ సినిమాతో అనేది మాత్రం ఇంకా తెలియదు. నిజానికి అకిరా కి హీరోగా కంటే మ్యూజిక్ కంటే చాలా ఇష్టమట. వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్లిలో అకిరా నందన్ వాయించిన మ్యూజిక్ ప్రతి ఒకరిని ఆకర్షించింది. దీంతో అకీరా గొప్ప మెజీషియన్ అవుతాడని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. కానీ తన తండ్రి లాగానే సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకోవాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: