Ravi Teja: బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ.. ఏ మూవీ అంటే..?

lakhmi saranya
Ravi Teja: అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సీక్వెల్తో ఫుల్ బిజీగా ఉన్నాడు. సుకుమార్‌ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఇక ఈ సినిమా కంటే ముందు వచ్చిన పుష్ప ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో తన నటనకు గాను బన్నీ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు.
ఇక ఈ ఒక్క సినిమాతో అల్లు అర్జున్ లైఫ్ మొత్తం మారిపోయిందని చెప్పుకోవచ్చు. గంగోత్రి తర్వాత అల్లు అర్జున్ ఆర్యతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక అప్పట్లో ఆర్య మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాని దిల్ రాజు నిర్మించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో దాదాపు అన్ని పాటలు కూడా హిట్ అయ్యాయి. గంగోత్రి తరువాత అల్లు అర్జున్ చాలా కాలం ఖాళీగా ఉన్నాడు. చాలా కథలు విన్నా అవి నచ్చక సినిమా తీయలేదు. ఇక సమయంలో దర్శకుడు బోయపాటి శ్రీను భద్ర కథను బన్నీకి చెప్పాడు. ఈ కథ విన్న తర్వాత సినిమా చేయాలా వద్దా అనే డైలమా లో పడిన బన్నీకి సుకుమార్ ఆర్య కథ చెప్పాడట. యూత్ ని ఆకట్టుకునే కథను ఎంచుకుని ఆర్య చేశాడు బన్నీ.
ఇక ఇదే కథను రవితేజ కు కూడా వినిపించగా ఆయన వెంటనే ఓకే చెప్పి చేసి బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్నాడు. అలా భద్ర సినిమాని మిస్ చేసుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న బన్నీ ఎంతటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో అని ఫాన్స్ లో ఓ రకమైన క్యూరియాసిటీ నెలకొంది. ఇక‌ రవితేజ సైతం వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇటీవల ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో తన తదుపరి చిత్రాలపై మంచి హైప్స్ ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: