ఎన్టీఆర్ తో ఒక్కసారి అయినా రొమాన్స్ చేయాలని ఉంది.. సిగ్గు పడకుండా మనసులో ఉన్న మాటను కక్కేసిన స్వీటీ..!

lakhmi saranya
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన అనుష్క శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సూపర్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అనంతరం ఎన్నో సూపర్ హిట్ మూవీలో నటించి ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ క్రమంలోనే అనుష్క శెట్టి ప్రభాస్ ప్రేమించుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. కానీ వీటిలో నిజం లేదని వీరిద్దరూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ అమ్మడు గత కొద్ది కాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.
చాలా రోజుల తర్వాత అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలీ శెట్టి చిత్రంతో రియంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఓ కొత్త మూవీని ప్రకటించింది. అలాగని సోషల్ మీడియాలోనూ సరిగ్గా యాక్టివ్ గా ఉండడం లేదు అనూష్క. పూర్తిగా అన్నిటికీ దూరమై ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తలో నిలిచింది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ మీకు ఎన్టీఆర్ మరియు రామ్చరణ్ లతో ఎవరితో హీరోయిన్గా ఛాన్స్ వస్తే ఇద్దరిలో ఎవరికీ ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే దానికి తడబడకుండా ఎన్టీఆర్ తో చేయాలని ఉందని చెప్పింది స్వీటీ.
అలాగే ఎప్పటినుంచో అనుకుంటున్నాను అతనితో ఒక్కసారైనా రొమాంటిక్ సీన్స్ అండ్ లవ్, యాక్షన్ అన్ని కలగలిపిన మూవీ చేయాలని ఉందంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. ప్రజెంట్ అనుష్క శెట్టి కామెంట్స్ సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ కామెంట్స్ ని చూసిన వారంతా.. నువ్వు కూడా ఇలా తయారయ్యావు ఏంటి అనుష్క. రొమాన్స్ కట్టా అంటున్నావు బాగా అప్డేట్ అయినట్లు ఉన్నావు. గతంలో రొమాంటిక్ సీన్స్ అంటేనే ఆమడ దూరం పారిపోయే నువ్వు ఇప్పుడు ఏకంగా నాకు ఆ హీరోతో రొమాన్స్ చేయాలని ఉంది. అంటూ మనసులో ఉన్న మాటని కక్కేస్తున్నావు.. ఏంటి ఈ మార్పు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: