కుర్రహీరోలకి చెమటలు పట్టిస్తున్న కమల్.. ఏమి లైనప్ గురూ?

Purushottham Vinay
కల్కి 2898 ఏడి సినిమాలో కమలహాసన్ క్యారెక్టర్ ను దర్శకుడు ఎలా డిజైన్ చేశాడో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీలో కమల్ హాసన్ క్యారెక్టర్ కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఉంటుందని సమాచారం. ఈ సినిమా చివరలో వచ్చే ఆ పాత్ర చాలా ఇంపాక్ట్ చూపించే విధంగా ఉంటుందట. ఇక సెకండ్ పార్ట్ పై కూడా కమల్ హాసన్ పాత్ర చాలా ఆసక్తిని పెంచుతుందని సమాచారం తెలుస్తుంది.ఫస్ట్ పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్ లో కమల్ హాసన్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది అని సమాచారం తెలుస్తోంది. అయితే ఫస్ట్ పార్ట్ లో మరీ 20 నిమిషాలు అంటే కాస్త తక్కువే. ప్రభాస్ తో కమల్ హాసన్ క్యారెక్టర్ ఒక రెండు మూడు సీన్స్ లో మాత్రమే ఉంటుందట. అయితే ఈ పాత్ర చేయడానికి కమల్ హాసన్ పారితోషకం కూడా గట్టిగానే తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.చాలా తక్కువ రోజుల్లోనే ఆయన షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. అయితే కమల్ హాసన్ దాదాపు పది కోట్ల రేంజ్ లోనే ఆ పాత్ర కోసం పారితోషకం తీసుకోవడం షాకింగ్ గా మారింది. ఇక సెకండ్ పార్ట్ మొదలైన తర్వాత ఆయనకు మరో రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకునే అవకాశం కూడా ఉంది.


కమల్ ఈ సంవత్సరం వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తూ కుర్ర హీరోలకి షాక్ ఇస్తున్నాడు. జూన్ లో కల్కి, జులై లో ఇండియన్ 2, నవంబర్ లో థగ్ లైఫ్,2025 జనవరిలో ఇండియన్ 3 ఇలా వరుస సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇలా కమల్ లైన్ అప్ కి కుర్ర హీరోలు షాక్ అవుతున్నారు.ఇక కల్కి సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అమితాబచ్చన్ అశ్వద్ధామ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక దీపికా పదుకొనే పద్మావతి అనే క్యారెక్టర్ లో కనిపించబోతోంది. దిశా పటాని అలాగే మరి కొంతమంది స్టార్ నటీనటులు కూడా ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రలలో కనిపిస్తారని సమాచారం తెలుస్తుంది. ఇక ఈ రేంజ్ భారీ క్యాస్ట్ తో సిద్ధమవుతున్న కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో రిలీజ్ అయ్యాక చూడాలి.ప్రపంచవ్యాప్తంగా చాలా భాషలలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ హడావిడి కూడా అప్పుడే మొదలైపోయింది. బుధవారం నాడు రామోజీ ఫిలిం సిటీ లో ఒక గ్రాండ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ప్రభాస్ అభిమానులు కూడా భారీ స్థాయిలో రాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: