సల్మాన్... మురగదాస్ కాంబో మూవీలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక..?

MADDIBOINA AJAY KUMAR
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రష్మిక మందన ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈమె కన్నడలో రూపొందిన కిరీక్ పార్టీ మూవీ తో మొదటి విజయాన్ని అందుకొని కన్నడ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఛలో మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత గీత గోవిందం మూవీ తో మరో విజయాన్ని అందుకోవడంతో ఈమె రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత ఈమెకు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు వరుసగా దక్కాయి. అందులో భాగంగా ఈమె కొంత కాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 1 సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించింది. పాన్ ఇండియా మూవీ గా రూపొందిన ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఈమెకు ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ లభించింది. ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు హిందీ సినిమాలలో వరసగా అవకాశాలు దక్కుతున్నాయి.

కొంత కాలం క్రితమే యానిమల్ అనే హిందీ సినిమాలో నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈమె మరో బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులో అవకాశాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ అనే మూవీ రూపొందనున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో సల్మాన్ కి జోడిగా రష్మిక ను ఈ మూవీ యూనిట్ ఓకే చేసినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజీ మూవీలో అవకాశాన్ని దక్కించుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: