టాప్ టిఆర్పి రేటింగ్ తెచ్చుకున్న 5 మూవీలు ఇవే..!

MADDIBOINA AJAY KUMAR
ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ విజయాలను కూడా నమోదు చేస్తాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే బుల్లి తెర ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తాయి. అలా ఇప్పటి వరకు బుల్లితెర ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించి అత్యధిక "టి ఆర్ పి" రైటింగ్ ను తెచ్చుకున్న టాప్ 5 మూవీ స్ ఏవో తెలుసుకుందాం.
అలా వైకుంఠపురంలో : అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా  29.4 "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో మొదటి సారి ప్రసారం అయినప్పుడు అత్యధిక "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకున్న సినిమాల లిస్టు లో ఇది మొదటి స్థానంలో కొనసాగుతుంది.
సరిలేరు నీకెవ్వరు : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 23.5 "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంది.
బాహుబలి 2 : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 22.7 "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంది.
శ్రీమంతుడు : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 22.5 "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంది.
పుష్ప పార్ట్ 1 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 22.5 "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

trp

సంబంధిత వార్తలు: