చెత్త రికార్డ్! హాట్ సీటుగా మారిన విశాఖ ఎంపీ సీటు?

Purushottham Vinay
విశాఖ ఎంపీ సీటు చాలా విలువైనది. ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచిన వారు గొప్పగా ఫీల్ అవుతారు. దేశంలో 542 లోక్ సభ సీట్లు ఉంటే అందులో అందరికీ తెలిసినవి కేవలం కొన్ని మాత్రమే.అందులో ఖచ్చితంగా విశాఖ ఎంపీ సీటు ఉంది. ఏపీలో మెగా సిటీగా ఉండడంతో ఈ సీటు మీద వైసీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా ఫోకస్ పెట్టాయి. బీసీ కార్డుతో పాటు లోకల్ స్లోగన్ తో వైసీపీ బొత్స ఝాన్సీని బరిలోకి దించడం జరిగింది.ఇక టీడీపీ అయితే మాజీ ఎంపీ దివంగత నేత ఎంవీవీస్ మూర్తి మనవడు శ్రీ భరత్ ని వరసగా రెండవసారి పోటీ చేయించింది. అయితే తాజాగా జరిగిన పోలింగ్ సరళి చూస్తే ఎవరు విజేత అవుతారన్నది చెప్పలేని పరిస్థితిగా ఉందని తెలుస్తుంది. 2019 లాగానే అనూహ్యమైన ఫలితం వస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది.ఎందుకంటే విశాఖ ఎంపీ సీటు పరిధిలో పోలింగ్ ఈసారి కూడా తక్కువ జరిగింది. దాంతో ఈ తక్కువ పోలింగ్ ఎవరి కొంప తగలబెడుతుందా అన్నది కూడా పార్టీలలో హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. మొత్తం 19 లక్షల మందికి పైగా ఓటర్లు ఉంటే ఓటేసింది మాత్రం కేవలం పదమూడు లక్షల మంది. దాంతో ఏపీలోని పాతిక ఎంపీ సీట్లలో అతి తక్కువ పోలింగ్ జరిగిన సీటుగా విశాఖ ఎంపీ సీటు చెత్త రికార్డ్ కొట్టింది.


విశాఖ ఎంపీ సీటు పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో క్రాస్ ఓటింగ్ జరిగింది అన్న వార్తతో రెండు పార్టీల శిబిరాలు వణికిపోతున్నాయి. ఎస్ కోటలో క్రాస్ ఓటింగ్ జరిగిందని టీడీపీ ఎంపీకి ఆ పార్టీ రెబెల్ వర్గం ఓట్లేస్తే వైసీపీ రెబెల్ వర్గం ఓట్లూ కూడా టీడీపీ నేత శ్రీ భరత్ కి పడ్డాయని అంటున్నారు. టీడీపీ టికెట్ ఆశించిన గొంప క్రిష్ణ వర్గం శ్రీ భరత్ కోసం పనిచేసిందని అంటున్నారు. అదే టైం లో టీడీపీ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్ధికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు అన్న ప్రచారం కూడా సాగుతోంది.ఇక మరో రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో అయితే టీడీపీ మంచి మెజారిటీతో గెలుసుంది అనుకున్న చోట కూడా వైసీపీకి అనుకూలంగా కొంత క్రాస్ ఓటింగ్ జరిగింది అని సమాచారం గట్టిగా వినిపిస్తుంది. ఇక విశాఖ సిటీలో రెండు సీట్లలో వైసీపీకి విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం తెలుస్తుంది. మరో రెండు చోట్ల హోరా హోరీ పోరు కూడా సాగింది. మొత్తం మీద చూసుకుంటే టీడీపీ గెలిచినా లేక వైసీపీ గెలిచినా పదివేల లోపే మెజారిటీ రావచ్చు అన్నది పోలింగ్ తరువాత ఒక బలమైన విశ్లేషణగా ముందుకు వస్తోంది. ఎవరు గెలుస్తారు అన్నది తెలియాలంటే ఖచ్చితంగా జూన్ 4 వరకూ వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: