సీమ ప్రజల ఆశీర్వాదంతో ఆ నేత మరోసారి సింహం అవుతాడా..?

Suma Kallamadi
రాయలసీమలో ఎవరు ఎక్కువగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటారో వారే రాష్ట్రంలో అధికారంలోకి వస్తారు. ఏపీలో రాయలసీమకు చెందిన వారే పాలనా పగ్గాలు సొంతం చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఏపీ సీఎం గా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి కూడా రాయలసీమ బిడ్డే. ఆయన కడప జిల్లాకు చెందినవారు. చంద్రబాబు వైఎస్సార్ షర్మిల కూడా రాయలసీమకు చెందినవారు. పవన్ కళ్యాణ్ కు నెల్లూరు మూలకాలు ఉన్నాయి. నెల్లూరుతో పాటు సీమలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న వారు మిగతా స్థానాలను కూడా సానుకూలంగా ప్రభావితం చేస్తున్నారు.
ఈసారి కూడా ఆ ప్రాంత ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అందువల్ల తాము గెలుస్తామని చంద్రబాబు అంటున్నారు. రాయలసీమ జిల్లాలలోని ప్రజల మనసులను గెలుచుకుంటేనే ఏపీలో సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది. వారి ఓట్లే చాలా కీలకం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమయంలో కూడా ఇదే విషయం నిరూపితమైంది రాజశేఖర్ రెడ్డి రాయలసీమ ప్రజల్లో తిరుగుతూ వారి కష్టాలను రైతుల బాధలను కన్నీళ్లను తెలుసుకుంటూ వారికి మంచి చేస్తానని హామీ ఇచ్చారు ఆయనపై నమ్మకం ఉంచి ఓట్లు వేయగా వెంటనే సీఎం అయిపోయారు మాట ఇచ్చిన ప్రకారం అన్ని వాగ్దానాలను నెరవేర్చే అందరి గుండెల్లో నిలిచిపోయారు ఇప్పుడు జగన్ కూడా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు.
 2014లో జగన్కు రాయలసీమ ప్రజలు అండగా నిలిచారు 30 సీట్లు అక్కడి నుంచే జగన్ గెలుచుకోగలిగారు. 2019లో రాయలసీమలో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. కుప్పంలో చంద్రబాబు నాయుడు, అనంతపురం జిల్లా హిందూపురంలో నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ అసెంబ్లీ స్థానంలో పయ్యావుల కేశవ్ మినహాయించి మిగిలిన 49 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ విజయ బావుటా ఎగరవేసింది. రాయలసీమ ప్రజలు ఎప్పుడూ కూడా వైయస్సార్ ఫ్యామిలీ కి అండగా నిలుస్తూ వస్తున్నారు ఈసారి కూడా అదే జరగొచ్చు అని రాయలసీమ బిడ్డలు ఆశీర్వదిస్తే జగన్ మరొకసారి సింహమైపోతారని అంటున్నారు. ఈసారి కూడా సింగిల్ గా వచ్చి సింహం లాగా గెలవబోయే జగన్ వెనక ఈ రాయలసీమ ప్రజలు ఎప్పుడూ వెన్నంటే ఉంటారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: