అలాంటి అగ్రిమెంట్ తో పెళ్లి చేసుకున్న సమంత-రాజ్ నిడమోరు..గబ్బు లేపుతున్న న్యూస్..!?
ఇక తాజాగా వినిపిస్తున్న మరో సంచలన వార్త ఏంటంటే… సమంత – రాజ్ నిడమోరు ఒక ప్రత్యేక అగ్రిమెంట్‌తోనే పెళ్లి చేసుకున్నారట అనే టాక్. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా లేదు. సమంత గానీ, రాజ్ నిడమోరు గానీ ఈ వార్తలపై స్పందించలేదు. అయినప్పటికీ యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో మాత్రం ఈ అంశం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వదంతుల ప్రకారం, సమంత మరియు రాజ్ నిడమోరు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారని, మొదటి వివాహం విఫలమైన అనుభవం నేపథ్యంలో ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకూడదనే ఉద్దేశంతో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పెళ్లి నిర్ణయం తీసుకున్నారట. భవిష్యత్తులో ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే కొన్ని లీగల్ అగ్రిమెంట్స్ సిద్ధం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
ఆ అగ్రిమెంట్ ప్రకారం, ఒకవేళ భవిష్యత్తులో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడితే, ఇద్దరూ ఒకరికి సంబంధించిన ఆస్తుల్లో మరొకరు జోక్యం చేసుకోరాదని, ఎవరి జీవితం వారిదే అన్న విధంగా ముందే ఒప్పందం చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని లీగల్ ప్రక్రియలు పూర్తయ్యాకే వివాహం జరిగినట్లు కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి.అయితే, ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వదంతులే తప్ప, నిజానిజాలు ఏమిటో ఎవరికీ స్పష్టంగా తెలియదు. అధికారికంగా సమంత లేదా రాజ్ నిడమోరు స్పందిస్తే తప్ప ఈ వార్తలకు స్పష్టత రానుంది. కానీ నిజం ఎంత ఉందో తెలియకపోయినా, ఈ అంశం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి విపరీతమైన చర్చకు దారి తీసింది.
ఇక సమంత మాత్రం ఎప్పటిలాగే తన ప్రొఫెషనల్ జీవితంపై దృష్టి పెట్టుతూ, ఈ రూమర్స్‌కి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వార్తలపై ఆమె స్పందిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.