జూలైలో కూడా క్లారిటీ లేని "ఇండియన్ 2"..?

MADDIBOINA AJAY KUMAR
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ కొన్ని రోజులు ఆగిపోయింది. దాని తర్వాత మళ్లీ ఎన్నో రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్ తిరిగి స్టార్ట్ అయింది.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. దానితో ఈ మూవీ ని ఈ సంవత్సరం జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ జూన్ నెలలో విడుదల అవుతుంది అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన పనులు కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి అని నేపథ్యంలో ఈ మూవీ ని జూన్ నెలలో విడుదల చేయడం లేదు అని తెలుస్తుంది. ఇక జూలై నెలలో ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు అందులో భాగంగా ఈ యూనిట్ జూలై 11 లేదా 17వ తేదీల్లో ఈ మూవీ ని విడుదల చేసే అవకాశం ఉన్న కొన్ని వార్తలు వచ్చాయి.

కానీ ఇందుకు సంబంధించి కూడా మేకర్స్ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని జూలై 17 వ తేదీన విడుదల చేసేందుకు గాను మేకర్స్ చూస్తున్నట్లు , ఆ తేదీ వరకు పనులు అన్ని అయ్యేట్లు ఉంటే తేదీని మరికొన్ని రోజుల్లో అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ మూవీ అయినటువంటి ఇండియన్ కు కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: