ప్రభాస్ మూవీ లో రామ్ చరణ్ హీరోయిన్..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే మూవీ చాలా రోజుల క్రితమే అనౌన్స్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుండే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి. ఇక అందులో భాగంగా ఈ సినిమా దర్శకుడు సందీప్ "స్పిరిట్" మూవీ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించాడు.

దీనితో ప్రభాస్ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఏ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించకపోవడంతో స్పిరిట్ మూవీ లో ప్రభాస్ పోలీస్ గెటప్ లో ఏ రేంజ్ లో ఉంటాడో , ఎలా నటిస్తాడో అనే దానిపై ఆయన అభిమానులు మరియు జనాలు కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే సందీప్ "యానిమల్" అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం స్పిరిట్ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సందీప్ ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ వరకు ఈ సినిమాకు సంబంధించిన కథ , ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నిటినీ పూర్తి చేసుకుని డిసెంబర్ నెలలోనే ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకు వెళ్లే ఆలోచనలో సందీప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా కియార అద్వానీ ని తీసుకొని ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందులో భాగంగా ప్రస్తుతం ఈమెతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజం గానే స్పిరిట్ మూవీ లో కియరా హీరోయిన్ గా నటిస్తే వీరి జంట సూపర్ గా ఉంటుంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: