సత్యదేవ్ "కృష్ణమ్మ" ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం హీరోగా , విలన్ గా ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న సత్యదేవ్ తాజాగా కృష్ణమ్మ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి గోపాలకృష్ణ దర్శకత్వం వహించగా ...ఈ మూవీ ని మే 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన చాలా ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వాటికి సూపర్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది.
 

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ వేదికను ఖరారు చేయడం మాత్రమే కాకుండా ఈ ఈవెంట్ కు ఎవరు ముఖ్య అతిధులుగా రాబోతున్నారు అనే విషయాలను కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మే 1 వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాదు లోని హైటెక్ సిటీ లో ఉన్న ట్రైడెంట్ హోటల్ లో నిర్వహించనున్నట్లు , అలాగే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ డైరెక్టర్ లు అయినటువంటి అనిల్ రావిపూడి , కొరటాల శివ , ఎస్ ఎస్ రాజమౌళి , సుకుమార్ , గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా రానున్నట్లు కూడా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను మే 1 వ తేదీన రాత్రి 8 : 01 నిమిషానికి విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: