అఫీషియల్ : "కుబేర" నుండి నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు . ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి అందులో కొన్నింటితో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు . ఈయన ఆఖరిగా నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా లవ్ స్టోరీ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుం ది.
 

ఇకపోతే ప్రస్తుతం ఈయన ధనుష్ , నాగార్జున ప్రాధాన పాత్రలలో రష్మిక మందన హీరోయిన్ గా కుబేర అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ధనుష్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాలోని నాగార్జున కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. నాగార్జున కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మే 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో అవుతుంది. ఇది ఇలా ఉంటే ధనుష్ , నాగార్జున ఈ మూవీ లో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ఇటు తెలుగు , అటు తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: