ప్రభాస్, కీర్తి సురేష్ కాంబినేషన్లో మిస్సయిన సినిమా ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
ఇప్పుడున్న స్టార్ హీరోలు కానీ స్టార్ హీరోయిన్ లు కానీ కొత్త  హీరోలు హీరోయిన్లతో సినిమాలో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే హీరో ఓకే హీరోయిన్ తో సినిమా అంటే చూడడానికి ఫాన్స్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఫ్యాన్స్ సైతం డిఫరెంట్ హీరో హీరోయిన్స్ కావాలి అని ఆశపడుతున్నారు. అయితే చాలామంది శని అభిమానులు ఆ స్టార్ హీరో ప్రభాస్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుంటుంది అని ఎప్పటినుండో కోరుకుంటున్నారు. ఇక కీర్తి సురేష్ కి మహానటి సినిమా తర్వాత ఎంతటి గుర్తింపు లభించిందో

 ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఏకంగా స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. మహానటి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో కీర్తి సురేష్ కు సినిమా చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. డార్లింగ్ అభిమానులు అయితే ఇప్పటి వరకు వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా కూడా రాలేదు. త్వరలోనే వస్తే బాగుంటుంది అని అందరూ భావిస్తున్నారు. కానీ ఇందులో భాగంగానే చాలామంది డైరెక్టర్ వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా సెట్ చేయాలి అని చాలా విధాలుగా ప్రయత్నించారట. అలా వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా మిస్ అయింది

 అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ సినిమా మరి ఏదో కాదు ది రాజా సాబ్. నిజానికి మారుతి ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా కీర్తి సురేష్ ని అనుకున్నారట . కానీ కీర్తి సురేష్ సెకండ్ హీరోయిన్ గా చేయను అంటూ చెప్పడంతో ఆయన ఈ సినిమాలో ఆమె పాత్రను తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ అయి ఉంటే కీర్తి సురేష్ చేసేదేమో కానీ అప్పటికే మరొక హీరోయిన్ కి ఫస్ట్ హీరోయిన్ ఛాన్స్ ఇవ్వడంతో మారుతి తాను ఇష్టపడిన కీర్తి సురేష్ కు అవకాశం ఇవ్వలేకపోయాడు అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: