టీడీపి: పార్టీ నుంచి మహాసేనకు షాక్.. ఎవరు ఊహించలేదుగా..?

Divya
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. కూటమిలో భాగంగా అటు జనసేన, టిడిపి, బిజెపి అభ్యర్థుల మధ్య సీట్ల విషయంలో కూడా ఎన్నో తగాదాలు ఇప్పటికీ వినిపిస్తూ ఉన్నాయి. అంతా సర్దు మునుగుతున్న సమయంలో గన్నవరం టిడిపి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చిన వాటిని వదిలేసుకున్న  మహాసేన రాజేష్ పవన్ కళ్యాణ్ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి గత రెండు రోజుల క్రితం అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా ఒక వీడియోతో పవన్ కళ్యాణ్ ని ఓడించాలని లేకపోతే ఆంధ్రప్రదేశ్ ను సర్వనాశనం చేస్తారంటూ కూడా ఇటీవలే విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది.

దీంతో అటు కూటమిలో మహాసేన రాజేష్ చిచ్చు పెట్టినట్టుగా అనిపించడంతో ఇటీవల టిడిపి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.. అదేమిటంటే టిడిపి పార్టీ నుంచి మహాసేన రాజేష్ ని సస్పెండ్ చేస్తున్నట్లుగా ఒక లెటర్ ని అచ్చమనాయుడు విడుదల చేశారు.. దీంతో ఒకసారిగా మహాసేన రాజేష్ అభిమానులు కార్యకర్తలు సైతం ఆందోళన చెందుతున్నారు. నిజం మాట్లాడితే ఇలాంటి పని చేస్తారా..ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించే తను ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కానీ టిడిపి పార్టీని తను గౌరవిస్తున్నారని కూడా వెల్లడించారు.. ఆ గౌరవానికి ఇచ్చే ఇదే నిదర్శనం ఇదేనా అంటూ ఎద్దేవ చేస్తున్నారు.

మరి మహాసేన రాజేష్ ను టిడిపి పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో తన తదుపరి నిర్ణయం ఏంటనే విషయం పైన అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ముఖ్యంగా కూటమిలోకి ఓట్లు పడాలి అంటే కచ్చితంగా మా కులము ఓట్లు ఉండాలని మహాసేన రాజేష్ ఎన్నోసార్లు తెలియజేశారు. ప్రస్తుతం అచ్చెమనాయుడు విడుదల చేసినటువంటి ఈ లెటర్లో.. తెలుగుదేశం పార్టీలో స్టార్ క్యాంపెనర్ గా ఉంటున్న స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఉంటున్న శ్రీ సరిపెళ్ల రాజేష్ మహాసేన గారిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశామని తెలుగుదేశం పార్టీలో ఉంటూ కూటమికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకే టిడిపి పార్టీ నుంచి సస్పెండ్ చేశామని అచ్చెమనాయుడు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: