ఒకే వ్యక్తి.. తండ్రీ కొడుకులతో పోటీ?

praveen
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన హడావిడి ముగియకముందే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఇక అన్ని పార్టీలు మరోసారి అలర్ట్ అయ్యాయి. ఇక ఈసారి లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇక ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడం నామినేషన్లు వేయడం పూర్తవగా.. ప్రచారంలో దూసుకుపోతున్నారు అన్ని పార్టీల అభ్యర్థులు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉన్నారు అని చెప్పాలి.

 అయితే కొన్ని కొన్ని పార్లమెంట్ స్థానాలలో పోటీ మాత్రం ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి తెలంగాణ రాజకీయాలలో అందరూ చర్చించుకుంటూ ఉండటం గమనార్హం. ఇలాంటి పార్లమెంటు స్థానాలలో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం కూడా ఒకటి. ఈ లోక్సభ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు 62 ఏళ్లుగా ఇక్కడ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక్కసారి గెలిచిన వ్యక్తి మరోసారి గెలిచిన దాఖలాలు లేవు. కానీ వీ. తులసీరామ్, గడ్డం వెంకటస్వామి అని ఇద్దరు మాత్రం ఇప్పటివరకు ఈ నియోజకవర్గం నుంచి రెండు అంతకంటే ఎక్కువ సార్లు విజయం సాధించిన నేతలుగా కొనసాగుతున్నారు.

 ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఒకప్పుడు తండ్రి పై పోటీ చేసిన నాయకుడే మళ్ళీ ఇప్పుడు కొడుకు పై కూడా పోటీ చేస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీలలో బిజెపి  అభ్యర్థిగా బరిలోకి దిగారు గోమాసే శ్రీనివాస్ రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు అని చెప్పాలి. అయితే ఈయన ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులతో తలపడుతూ ఉండడం గమనార్హం. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బిఆర్ఎస్ తరఫున నిలబడిన గోమాసే శ్రీనివాస్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలోకి దిగిన గడ్డం వివేక్ తో పోటీపడ్డారు. ఇప్పుడు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే పార్టీ నుంచి బరిలోకి దిగిన వివేక్ కుమారుడు వంశీకృష్ణ తో గోమాసె శ్రీనివాస్ పోటీ పడుతూ ఉండడం గమనార్హం. ఇప్పటికే ఓసారి ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న గోమాసె శ్రీనివాస్  అప్పుడు తండ్రి వివేక్ తో పోటీపడి ఇక ఇప్పుడు కొడుకు వంశీకృష్ణ తో కూడా పోటీ పడుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: