లాభాల బాటలో సిద్దు జొన్నలగడ్డ టిల్లు 2..!?

Anilkumar
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా టిల్లు 2 రెండేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్ డీజే టిల్లు సినిమాకి సీక్వల్ గా వచ్చిన ఈ సినిమా లాభాల బాటలో నడుస్తోంది. ఫస్ట్ పార్ట్ లో నేహా శెట్టి హీరోయిన్గా కనిపించింది. కాగా ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ హీరోఇన్ గా నటించిన ఈ సినిమా మార్చ్ 29 నా విడుదలై భారీ వసూళ్లను సాధిస్తుం.ది ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రెస్మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ సినిమాకి మొదటి రోజు అదిరిపోయే

 కలెక్షన్స్ వచ్చినట్లుగా వెల్లడించింది. దాదాపుగా 25 కోట్ల వచ్చిందని నమ్ముతున్నట్లు నిర్మాత నాగవల్లి తెలిపారు. ఇక ఆయన చెప్పింది నిజం చేస్తూ మొదటి రోజు 23.7 కోట్ల సంవత్సరాల కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది ఈ సినిమా. గుంటూరు కారం సినిమా తర్వాత ఏడాది ఈ సినిమాదే హైయెస్ట్ ఓపెనింగ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా ఈ సినిమాకి ఓపెనింగ్స్ సైతం చాలా బాగున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ రైట్స్ విషయంలో కూడా రికార్డు తిరగ రాస్తుంది అని భావిస్తున్నారు. అయితే ఒక ప్రముఖ ఓటిటి ఈ సినిమాలో ఏకంగా 15 కోట్లు చెల్లించి

 ఓటీటి రైట్స్ ను దక్కించుకుంది అన్న వార్తలు వినబడుతున్నాయి. ఇక ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఇవే వార్తలు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి.  పెద్ద  సినిమా లకు ధీటుగా టిల్లు 2 దూకుడు చూపిస్తుంది. మొదటి రోజే 24 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండు రోజుల్లోనే 50 కోట్లకు చేరువైంది. ఈ వసూళ్లు చూస్తుంటే మరో రెండు రోజుల్లో 100 కోట్లకు చేరువయ్యేలా కనిపిస్తుంది.  మరోసారి టిల్లుగాడు థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పట్లో పెద్ద లు లేవు కాబట్టి ఈ చిత్రం ఈజీగా 200 కోట్లు వసూళ్లు చేస్తుందని నమ్మకంతో ఉన్నారు మూవీ మేకర్స్. మొత్తానికి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన కథలు వేసుకున్నాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: