ఏపీ: వైసీపీకి ముద్రగడ దరిద్రం పట్టింది?

Suma Kallamadi
ఏపీలో ఎన్నికల వేళ చాలా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మనకి ఓ బాధ్యతను ఎవరన్నా అప్పగించినప్పుడు మనకి చేతనైతే చేస్తానని, లేదంటే లేదని చెప్పడం మొదటిగా మనలో ఉండాల్సిన మంచి లక్షణం. అంతేగాని చేస్తానని చెప్పి దానిని సరిగా నిర్వర్తించకపోతే మొదటికే మోసం వస్తుంది. అవును, ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం పరిస్థితి ఇంచుమించుగా అదే. కులం.. కులం అంటూ కులాన్ని మాత్రమే ఆయుధంగా వాడుకుంటూ రాజకీయాలు చేసేందుకు ఆసక్తిని కనబరిచే ముద్రగడ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు ఇపుడు నెట్టింట సంచలనంగా మారుతున్నాయి. అదేసమయంలో ముద్రగడ విషయంలో పవన్ అయితే చాలా తెలివిగా ఆచితూచి వ్యవహరిస్తుండడం గమనార్హం.
మొన్నటి విషయానికొస్తే ముద్రగడ కుమార్తె.. అల్లుడు జనసేన పార్టీలో చేరేందుకు వచ్చినప్పుడు వారిని సున్నితంగా వారించటం.. తర్వాతి రోజుల్లో వారిని పార్టీలో చేర్చుకుంటామని చెప్పడం అందరు కళ్లారా చూసారు. అంతేకాకుండా ఆ సందర్భంగా ముద్రగడ మీద పల్లెత్తు మాట అనకుండా అంతులేని సహనాన్ని ప్రదర్శించారు పవన్. ఆయన పెద్దరికాన్ని ప్రస్తావిస్తూ ఆయనపై తనకున్న గౌరవాభిమానాల్ని ప్రదర్శించారు కూడా. ముద్రగడతో పోలిస్తే పవన్ వయసులోనే కాదు.. రాజకీయ అనుభవంలోనూ చిన్నోడు. అయినప్పటికీ.. ముద్రగడతో పోలిస్తే మరెంతో విశాల హ్రదయంతో ఆలోచిస్తానన్నట్లుగా పవన్ తీరు ఇక్కడ అందరినీ ముచ్చట గొలిపింది.
అక్కడే వచ్చింది అసలు సమస్య. పవన్ తనని ఎంతలా గౌరవిస్తున్నా పవన్ తీరును పట్టించుకోకుండా మరింత ఆగ్రహాన్ని ఆయనపై ప్రదర్శిస్తూ చేస్తున్న ముద్రగడ వ్యాఖ్యలు ఇపుడు వైసీపీకి ప్రతికూలంగా మారతాయంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ముద్రగడ నోటికి తాళం వేయాల్సిందిగా కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలు అభిప్రాయ పడుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అవును, ముద్రగడ వ్యాఖ్యలపై రాజకీయంగా పెను దుమారంగా మారటం.. పవన్ కు సానుకూలంగా మారుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా ముద్రగడ మాటల దూకుడుకు బ్రేకులు వేయకుంటే మొదటికే మోసం రావటం ఖాయమంటున్నారు వైసీపీ ప్రధాన కార్యకర్తలు, నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: