ఈ 7 ఉమ్మడి జిల్లాల్లో వైసీపీదే హవా.. కూటమి నేతలకు కన్నీళ్లే మిగులుతాయా?

Reddy P Rajasekhar

ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందనే జగన్ ధీమాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 7 ఉమ్మడి జిల్లాలే కారణమని తెలుస్తోంది. ఈ 7 ఉమ్మడి జిల్లాల్లో వైసీపీకి పూర్తిస్థాయిలో పాజిటివ్ పరిస్థితులు ఉండటం, మిగతా ఉమ్మడి జిల్లాల్లో కనీసం సగం స్థానాల్లో వైసీపీ గెలిచే పరిస్థితులు ఉండటంతో ఈ ఎన్నికల ఫలితాలతో కూటమి నేతలకు కన్నీళ్లే మిగులుతాయా? అనే చర్చ జరుగుతుండటం గమనార్హం.
 
ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి కడప, ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి అనంతపూర్ జిల్లాలతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి విశాఖ జిల్లాలలో వైసీపీ ప్రభంజనం మామూలుగా ఉండదని తెలుస్తోంది. ఈ జిల్లాల్లో మాత్రం కూటమి నేతలకు కన్నీళ్లే మిగులుతాయని ఇందుకు సంబంధించి ఎలాంటి సందేహాలు అక్కర్లేదని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
 
ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరులో సైతం వైసీపీ సత్తా చాటే ఛాన్స్ అయితే ఉంది. గోదావరి, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో మాత్రం కూటమికి ఫేవర్ గా ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ మళ్లీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని జగన్ తాజా పోస్ట్  తో క్లారిటీ అయితే వచ్చేసింది.
 
సీఎం జగన్ వ్యూహాలు, ప్రతివ్యూహాలు అన్నీ సైలెంట్ గా ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వాళ్ల విషయంలో జగన్ ఒకింత కఠినంగా వ్యవహరిస్తారని కూడా పేరు ఉంది. కూటమి నేతలు ఎగ్జిట్ పోల్స్ లో సైతం తమకు అనుకూల ఫలితాలు రావడం కష్టమేనని భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. పవన్, బాబు నమ్మకం నిజమవుతుందో లేక జగన్ నమ్మకం నిజమవుతుందో చూడాల్సి ఉంది. ఎన్నికల ఫలితాలకు సంబంధించి అటు వైసీపీ నేతలు, ఇటు కూటమి నేతలు ఒకింత కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తుండగా ఏం జరగనుందో చూడాల్సి ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: