మా బుల్లెట్ల దమ్ము చూపిస్తా.. రాజాసింగ్‌ రంకెలు?

Chakravarthi Kalyan
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బక్రీద్‌ పండగ వస్తుంది కాబట్టి హిందూ కార్యకర్తలెవ్వరూ బయటకు రావద్దు.. ఆవులను పట్టుకోవద్దని పోలీసులు బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. హిందూ కార్యకర్తలకు పోలీసులు ఫోన్‌ చేసి బెదిరించడం పట్ల రాజాసింగ్‌ ఆగ్రహాం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పును గౌరవించే బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులకు లేదా అని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రశ్నించారు. ఆవులు, ఎద్ధులు, దూడలను అక్రమంగా తరలించి వధిస్తే అరెస్ట్‌ చేయాలని సుప్రీం కోర్టు చెప్పిందని ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు.

పోలీసులే కసాయిలకు కొమ్ముకాస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ లోపలికి ఆవులతో వస్తున్నవాహానాలను పోలీసులు అడ్డుకోకుండా.. అనుమతిస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. గో రక్షణ కోసం స్వయంగా తానే రంగంలోకి దిగుతున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పష్టం చేశారు. గో రక్షణ కోసం ఎవరైనా రోడ్డుపైకి వస్తే షూట్‌ చేయండని కొంతమంది చెబుతున్నారని.. మా బుల్లెట్ల దమ్ముందా.. వాళ్ల బుల్లెట్ల దమ్ముందా చూపించడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే రాజాసింగ్‌ సవాల్‌ విసిరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: