ఏపీ:పవన్ కంటే వర్మాకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువా..?

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాకముందే ఆటు టీడీపీ జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా పొత్తు ప్రకటించినప్పటి నుంచే ఎన్నో ఇబ్బందులు కూడా తలెత్తాయి.పార్టీలో మొదటి నుంచి కష్టపడిన నేతలకు జనసేన టికెట్లు ఇవ్వకుండా టిడిపి నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వడంతో చాలామంది పార్టీని విడడం కూడా జరిగింది. ఇదంతా ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో తాజాగా జనసేన,టిడిపి మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా పిఠాపురంలో టిడిపి నేత వర్మ ఎమ్మెల్యే టికెట్ ని త్యాగం చేయడంతో పవన్ కు ఈ టికెట్ దక్కిందని టిడిపి కార్యకర్తలు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపు టిడిపి నేత వర్మ పైన ఆధారపడి ఉన్నదంటూ తెలుపుతున్నారు. ఈ విషయాన్ని పవన్ కూడా ఒప్పుకోవడం  మైనస్ గా మారిపోయింది. అలాగే టిడిపి నేతలు వర్మ బర్రిలోకి లేకపోవడంతో టీడీపీ కేడర్ మొత్తం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పవన్ గెలుపు పై ధీమాతో ఉంటున్నారు జనసేన నేతలు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిస్తే అక్కడ నెంబర్ 2 స్థానం అనేది ఎవరిదన్న విషయం పైన టిడిపి జనసేన నేతల మధ్య పోరు కొనసాగుతోంది.
పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం టికెట్ త్యాగాన్ని చేసిన వర్మ ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిస్తే స్థానిక నేత కాబట్టి ఆయనకే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పలువురు టిడిపి నేతలు తెలియజేస్తున్నారు. మరొకవైపు నాగబాబు పెత్తనం చూపిస్తారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వర్మ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు నా వల్లే అని టీవీ డిబేట్లలో కూడా తెలియజేస్తూ ఉన్నారు. దీంతో ఒకవేళ పవన్ గెలిచిన క్రెడిట్ కూడా వర్మకే పోతుందని జనసేన నేతలు కార్యకర్తలు వాపోతున్నారు.

ఏది ఏమైనా ఒక పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్.. అలాగే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్  కలిగివున్న హీరో అయినప్పటికీ... టిడిపి నేత వర్మ ముందు దిగదుడుపే అన్నట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: