వైసీపీ విక్టరీ: జగన్‌ గెలిస్తే.. మరో పాతికేళ్లు పక్కా?

మళ్లీ గెలిస్తే జగన్‌కు తిరుగులేదు
మరింత బలహీనం కానున్న విపక్షాలు
జనం మెప్పుపొందితే మరో పాతికేళ్లు
ఒక్క ఛాన్స్‌.. ఒక్కసారి అధికారం ఇవ్వండి.. ఆ తర్వాత ముప్పై ఏళ్లు సుభిక్షంగా పాలిస్తా.. ప్రతి ఇంట్లో వైఎస్‌ఆర్‌ ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉండాలి.. ఇదే నా లక్ష్యం.. జగన్‌ 2014 నుంచి చెబుతున్నది ఇదే. ఆయన అభ్యర్థనను జనం 2014లో వినకపోయినా.. 2019లో విన్నారు. కనీవినీ ఎరుగని మెజార్టీతో అధికారం అప్పగించారు. రాష్ట్ర చరిత్రలోనే ఏ నాయకుడూ కనీసం ఊహించని స్థాయిలో ఘన విజయం అందించారు. తెలుగు దేశానికి ఆ పార్టీ చరిత్రలోనే ఎన్నడూ దక్కని ఘోర పరాజయం చవిచూపారు.

ఇచ్చిన మాట ప్రకారమే ఐదేళ్లూ పాలించిన జగన్‌.. తన పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. చాలా మంది నేతలు కనీసం ఊహించని స్థాయిలో పెను మార్పులు తెచ్చారు. గాంధీ గ్రామ స్వరాజ్య భావనను నిజం చేస్తూ పాలనను పేదింటి ముంగిటకు చేర్చారు. గ్రామస్తులు పల్లె దాటకుండానే అన్ని సేవలు అక్కడికే వచ్చేలా సంస్కరణలు తీసుకొచ్చారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి పల్లె ముంగిటకు ప్రభుత్వాన్ని దించారు.

వాలంటరీ వ్యవస్థ మరో కీలక నిర్ణయం. ఒక్కో వాలంటీరుకు 50 కుటుంబాలు అప్పగించి.. వారి బాధ్యతలను అప్పగించారు. ఏ సమస్య వచ్చినా.. ఎలాంటి పథకం కావాలన్నా వాలంటీరుకు చెబితే చాలు అనే పరిస్థితి తీసుకొచ్చారు. అవ్వా, తాతలకు ప్రతి నెలా ఒకటో తారీఖును కలలో కూడా ఊహించని విధంగా ఉదయాన్నే తలుపుకొట్టి మరీ పింఛను చేతిలో పెట్టించాడు. పాలన అంటే నగరాలు, ఆకాశ హార్మ్యాలు, ఐటీ పరవళ్లు కాదు. సామాన్యుడి ముఖంలో చిరునవ్వు అన్న భావనను జగన్‌ అక్షరాలా నమ్మారు.  

నా పాలనలో మీకు లాభం జరిగితేనే ఓటేయండని ధైర్యంగా ప్రజలముందుకు వెళ్లిన జగన్‌.. మరోసారి గెలిస్తే ఈ సంక్షేమ రాజ్యాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తారనడంలో సందేహం లేదు. అంతే కాదు. విశాఖ రాజధానిగా పాలనను మరింతగా పరుగులు పెట్టిస్తారు. ఈసారి కూడా ఓడిపోతే టీడీపీ చెల్లా చెదురు కావడం ఖాయం. ఇక అప్పుడు జనసేనే ప్రధాన ప్రతిపక్షం కావచ్చు. ఇలా ప్రజా సంక్షేమమే పరమావధిగా జగన్‌ పాలన సాగిస్తే.. ఆయన కలగన్నట్టు ఏపీని 30 ఏళ్లు పాలించేందుకు గట్టి పునాది మాత్రం పడుతుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: