ఏపీ: విశాఖను నిండా ముంచేసిన జగన్ అండ్ బ్యాచ్?

Suma Kallamadi
ఎన్నికలవేళ అధికార వైస్సార్సీపీ పార్టీ అధినేత జగన్ ఐదేళ్ల పాలనలో విశాఖపట్నం తీవ్ర స్థాయిలో దోపిడీకి గురైందంటూ కొన్ని విమర్శలు మీడియాలో గట్టిగా వినబడుతున్నాయి. విశాఖపట్నం ప్రాంతం ఆంధ్రా ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విశాఖ భారత దేశంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. బంగాళా ఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం కలవు. భారత దేశపు మొట్ట మొదటి ఓడ అయినటువంటి "జల ఉష" ఇక్కడే తయారై అప్పటి ప్రధాన మంత్రి జవాహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా జల ప్రవేశం చేసిందని ఎంతమందికి తెలుసు? విశాఖపట్నానికి విశాఖ, వైజాగ్‌, వాల్తేరు అనే పేర్లు కూడా కలవు.
ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖను వైజాగ్ అని పిలుస్తూ వుంటారు. కాగా 2019లో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నంని కార్యనిర్వాహక రాజధానిగా ప్రతిపాదించాడు. ఈ నేపథ్యంలోనే విశాఖను అడ్డగోలుగా దోచుకున్నాడని రిపోర్ట్స్ చెబుతున్నాయి. సుందరమైన ఈ నగరంపై ప్రభుత్వ పెద్దలు కపట ప్రేమని నటిస్తూ విలువైన భూములను దోచేశారు. అదేవిధంగా 3 రాజధానుల డ్రామాతో ఇక్కడ పాగా వేసి... విశాఖను పీల్చి పిప్పిచేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, వివాదాలు సృష్టించి, ఆ తర్వాత ‘సెటిల్‌మెంట్‌’ పేరుతో పలు ప్రైవేటు భూములను కొట్టేశారని వినికిడి. రుషికొండకు గుండు కొట్టి... దానిపై రూ.450 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి మరీ ముఖ్యమంత్రి జగన్‌ కోసం అత్యంత విలాసవంతమైన భవనాలు కట్టడం జరిగింది.
అదేవిధంగా విలువైన కార్యాలయాల్ని, స్థలాల్ని అప్పుల కోసం ఇష్టమొచ్చినట్టు తాకట్టు పెట్టి ఐటీ రంగాన్ని సర్వనాశనం చేశారు. అవును, విశాఖ పేరు చెబితే గుర్తొచ్చే పర్యాటకరంగాన్నీ పొట్టనబెట్టుకున్నారు. గడిచిన ఐదేళ్లలో విశాఖకు కొత్తగా తెచ్చిన పరిశ్రమ, ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదు రాకపోగా గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడుల్నీ, పరిశ్రమలనూ తరిమి తరిమి కొట్టేసారు. విషయం ఏమిటంటే ఈ ఐదేళ్లలో వైకాపా నాయకులు, వారి బినామీల చేతుల్లోకి వెళ్లిపోయిన ప్రాజెక్టుల్లో బయటకు కనిపిస్తున్నవాటి విలువే సుమారు రూ.8,450 కోట్లు ఉంటాయని అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: