ప్రభాస్ కోసం రంగంలోకి దిగనున్న మహేష్..?

MADDIBOINA AJAY KUMAR
మహేష్ బాబు మంచి తనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఎన్ని సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తోటి నటులు ఏదైనా సహాయం అడిగినట్లు అయితే వెంటనే ఏమీ ఆలోచించకుండా వారి కోసం ఆ పని చేసి పెడుతూ ఉంటాడు. ఇకపోతే సినిమాల్లో చాలా సంవత్సరాలుగా హీరో ఇంట్రడక్షన్ కోసం మరియు మరికొన్ని సన్నివేశాలను హైలెట్ చేయడం కోసం మంచి క్రేజ్ కలిగిన హీరోలతో వాయిస్ ఓవర్ చేపిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ పాత్రల వెట్ ను మరింత పెంచడం కోసం. ఇక ఇప్పటికే మహేష్ బాబు ఎంతో మంది హీరోలను పరిచయం చేస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.

కొన్ని సంవత్సరాల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జల్సా మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో పవన్ ఎలివేషన్ సీన్స్ కి సంబంధించిన వాయిస్ ఓవర్ ను మహేష్ బాబు ఇచ్చాడు. ఇది ఆ సమయంలో అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇకపోతే మరోసారి మహేష్ ఓ స్టార్ హీరో కోసం వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో విష్ణు అవతారంలో ఉన్న ప్రభాస్ ను పరిచయం చేసే సన్నివేశానికి మహేష్ తో వాయిస్ ఓవర్ ఇప్పించేందుకు మూవీ యూనిట్ ట్రై చేస్తున్నట్లు , అందులో భాగంగా మహేష్ ను సంప్రదించగా ఆయన కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక వేళ నిజం గానే ప్రభాస్ "కల్కి" మూవీ కి మహేష్ కనుక వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు అయితే అది ఈ సినిమాకు మరింత కలిసి వచ్చే అంశంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: